సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల్లో విషాదం ఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి వేడుకల్లో మద్యం తాగి బిర్యానీ తిన్న 17 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన నగరంలోని జగద్గిరిగుట్ట పరిధిలో వెలుగుచూసింది.
వివరాల మేరకు.. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్‌లో న్యూ ఇయర్ సందర్భంగా 17 మంది కలిసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మద్యం తాగి.. బిర్యానీ తిన్నారు. అనంతరం, వీరంతా అస్వస్థతకు గురయ్యారు. కాసేపటికే వీరిలో పాండు(53) మృతి చెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న మిగతా వారిని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.


