విదేశాల్లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు అగ్నిప్రమాదంలో చనిపోయినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. మరణించిన విద్యార్థి పేరు తోకల హృతిక్ రెడ్డి.
హృతిక్ స్వస్థలం జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామం. అతను నివాసం ఉంటున్న భవనంలో అగ్ని ప్రమాదం జరగ్గా.. మంటల్లో కాలిపోయి అతను చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది.


