
దాదాపు 200 మందికిపైగా ప్రయాణికులు. ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. రెండుగంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే ప్రయాణికులకు కలిగిన అంతరాయంపై ఎయిరిండియా ప్రకటన చేసినా.. చేయకపోయినా.. అది ఏసీ వల్లే అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చేసింది. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన విమానంలో ఏసీ పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
పీటీఐ కథనం ప్రకారం.. బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ రాత్రి 11గం. సమయంలో సింగపూర్‌కు బయల్దేరాల్సి ఉంది. ఇంతలో సాంకేతిక సమస్య తలెత్తిందని అనౌన్స్‌మెంట్ చేశారు. అయితే.. రెండు గంటలు గడిచినా మరమ్మత్తులు కాలేదు. ఆపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా ప్రయాణికులను సిబ్బంది కిందకు దించేశారు. ఈ ఘటనపై ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే..
సోషల్ మీడియాలో కొన్ని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఏసీ పని చేయకపోవడంతో ప్యాసింజర్లు మ్యాగజైన్లు, న్యూస్‌పేపర్లతో విసురుకుంటున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఎయిరిండియా విమానాల్లో ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలోనే చోటు చేసుకున్నాయి.
Now after suffering without AC for around 2 hrs, passengers of Delhi-Singapore @airindia flight being deplaned suspecting a technical glitch. Pathetic service @airindia @DGCAIndia @moneycontrolcom https://t.co/omaceiKZ41 pic.twitter.com/MOccbgH4JT
— Ashish Mishra (@AshishM1885) September 10, 2025
ఢిల్లీ–సింగపూర్ విమానం (AI2380) – సెప్టెంబర్ 10, 2025(తాజా ఘటన)
బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానంలో విద్యుత్ సరఫరాలో లోపంతో పని చేయని ఏసీలు!
200 మందికి పైగా ప్రయాణికులు రెండు గంటల పాటు ఎదురు చూశాక.. చివరికి విమానం నుంచి దిగమన్నారు
ఢిల్లీ–పాట్నా విమానం – మే 19, 2025
తీవ్ర వేడిలో AC పనిచేయకపోవడంతో ప్రయాణికులు పేపర్లు, మ్యాగజైన్లు ఉపయోగించి గాలి తీసుకునే ప్రయత్నం
రిషి మిశ్రా అనే నేత ఓ వీడియో షేర్ చేసి విమానయాన మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు
అహ్మదాబాద్–లండన్ విమానం (AI171) – జూన్ 12, 2025
ఈ విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే.. విమానం క్రాష్‌కి ముందు ప్రయాణికులు AC పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు
TV స్క్రీన్లు, లైట్లు, సిబ్బందిని పిలిచే crew call buttons కూడా పనిచేయలేదని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
ఎయిర్ ఇండియా CEO ఏమన్నారంటే..
వరుసగా ఈ తరహా ఘటనలు జరగడంపై కాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) స్పందిస్తూ.. ఎయిరిండియాకు ఉన్న విమానాల సంఖ్య, సిబ్బంది, సంస్థ పరిమాణాన్ని బట్టి చూస్తే.. ఇలాంటి సమస్యలు తలెత్తడం సాధారణమే. అయినప్పటికీ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం.