breaking news
Dreamliner
-
అరిగిపోయిన టైర్లు.. అడుగడుగునా నిర్లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ: విమానసంస్థల నిర్లక్ష్యం, విమానాశ్రయాల నిర్వహణ తీరుపై కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగు చూశాయి. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విషాదం నేపథ్యంలో ఈనె 20, 21వ తేదీల్లో పౌరవిమాన యాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) దేశంలోనే అత్యంత రద్దీ అయిన ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో సేఫ్టీ ఆడిటింగ్ చేపట్టింది. ఒక విమానయాన సంస్థకు చెందిన విమానం టైర్లు పూర్తిగా అరిగిపోయినా దాన్ని అలాగే టేకాఫ్ చేయిస్తున్నట్లు గుర్తించింది. వెంటనే ఆ విమానాన్ని నిలిపివే యాలని అక్కడికక్కడే ఆదేశాలిచ్చింది. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసి ఇలాంటివే పలు లోపాలు డీజీసీఏ ఆడిట్ సమ యంలో అధికారుల దృష్టికి వచ్చాయి. అహ్మదాబాద్‌లో ఘోర విషాదం జరిగిన తర్వాత కూడా దేశీయ విమా నాయాన సంస్థల నిర్వహణ తీరు మారకపోవడంపై డీజీసీఏ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. నిబంధనలు బేఖాతరు...ఒక ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ఉండే సెట్టర్ లైన్ మార్కింగ్ కనిపించని విషయాన్ని అధికారులు ఆడిట్లో గుర్తించారు. పైలట్లకు ఈ మార్కింగ్ స్పష్టంగా కనిపించకుంటే రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విమానం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, విమాన సంస్థలు పలురకాల డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కానీ, చాలావరకు విమానయాన సంస్థలు గత మూడేళ్లుగా అవసరమైన డేటాను అప్డేట్ చేయలేదని తెలిసింది. విమానాశ్రయం లోపల స్పీడ్ గవర్నర్లు లేకుండానే చాలా వాహనాలు నడుస్తున్నట్లు, గ్రౌండ్ హ్యాండ్లింగ్‌లో కూడా చాలా లోపాలు ఉన్నట్లు ఆడిట్లో గుర్తించారు. విమానం ఒకటైతే.. శిక్షణ మరొకటి...ఒక విమానం నడపడానికి పైలట్‌కు సిమ్యులేటర్ శిక్షణ ఇస్తారు. పైలట్ ఆ విమానాన్ని నడపడానికి, అందులోని కమాండ్లను అర్థం చేసుకోవడానికి ఈ శిక్షణ ఇస్తారు. అయితే, విమానం ఒకటైతే పైలట్‌కు శిక్షణ ఇచ్చే సిమ్యులేటర్ ఇంకొకటని, అది ఆ విమానం కాన్ఫిగరేషన్‌తో సరిపోలలేదని సేఫ్టీ ఆడిట్లో వెల్లడైంది. దీంతో, విమాన ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే పైలట్‌కు దిక్కుతోచని స్థితి తప్పదని తేలింది. ఇంజనీర్లు కూడా లేరు విమానం నిర్వహణ సమయంలో ఇంజనీర్లు కొన్ని ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ మాన్యువల్‌లను పాటించడం లేదని కూడా ఈ ఆడిట్లో తేలింది. విమానంలో ఏమైనా లోపాలు తలెత్తితే వాటిని సరిచేయడానికి చాలా చోట్ల ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్లు లేరని గుర్తించారు. విమానానికి సబంధించిన మరమ్మతుల రిపోర్ట్‌ను టెక్నికల్ లాగ్ పుస్తకంలో నమోదు చేయడంలేదని తేలింది. ఈ రికార్డును తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని సైతం డీజీసీఏ సేఫ్టీ ఆడిట్ బృందం గుర్తించింది. -
ఎయిరిండియా రద్దుల పర్వం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్/కోల్‌కతా: అహ్మదా బాద్ ఘోర ప్రమాదం తర్వాత డ్రీమ్‌లైనర్ రకం విమానాలతో కొనసాగుతున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసులకు ‘క్యాన్సిల్’ మచ్చ అంటుకుంది. మంగళవారం ఏడు ఎయిర్ఇండియా విమా నాలు రద్దుకాగా వాటిలో ఆరు విమానాలు డ్రీమ్ లైనర్ 787–8 రకానికి చెందినవి ఉండడం గమనార్హం. సాంకేతికలోపం సహా ఇతరత్రా కారణాలతో డ్రీమ్లైనర్లు గాల్లో చక్కర్లుకొట్టడం మానేసి పార్కింగ్ ప్రాంతానికే పరిమితమయ్యాయి. సాంకేతికలోపంతో..ఢిల్లీ నుంచి పారిస్‌కు వెళ్లాల్సిన డ్రీమ్‌లైనర్ విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో దానిని రద్దుచేశారు. ఇలాంటి మరో విమానం అందుబాటులో లేకపోవడంతో అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన విమాన సర్వీస్ క్యాన్సిల్ అయింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఎయిర్ఇండియా సంస్థ తన విమానాలను క్షణ్ణంగా తనిఖీలు చేశాక రాకపోకలకు పంపిస్తోంది. ఈ కారణంగానే ఎక్కువ విమానాలు క్యాన్సిలేషన్ బారినప డుతున్నాయని ఈ రంగ నిపుణులు చెబుతు న్నారు. మంగళవారం అధిక సంఖ్యలో విమానాలు రద్దవడంతో ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు.దీనిపై ఎయిర్ఇండియా స్పందించింది. ‘‘రద్దయిన విమాన ప్రయాణికులను హోటల్ వసతులు, లేదంటే టికెట్ క్యాన్సిలేషన్‌పై 100 శాతం రీఫండ్ లేదంటే తదుపరి రీషెడ్యూలింగ్‌కు వెసులుబాటు కల్పిస్తున్నాం’’ అని ఎయిర్ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అహ్మదాబాద్ నుంచి ‘తొలి’విమానం రద్దుఅహ్మదాబాద్ దుర్ఘటన తర్వాత అదే ఎయిర్పోర్ట్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు లండన్‌కు బయల్దేరి వెళ్లాల్సిన ఎయిర్ఇండియా వారి ఏఐ159 విమానం రద్దయింది. విమానప్రమాదం తర్వాత ఇక్కడి నుంచి వెళ్తున్న తొలి ఎయిర్ఇండియా అహ్మదాబాద్–లండన్ సర్వీస్ విమానం ఇదే. మరోవైపు ఢిల్లీ నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్ ఛార్లెస్ డీ గాలే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సిన ఏఐ143 విమానం సైతం రద్దయింది.ఎయిరిండియా విమానంలో పనిచేయని ఇంజన్శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి ముంబైకి రావాల్సిన ఎయిర్ఇండియా విమా నం సాంకేతిక లోపంతో కోల్‌కతాలో ఆగిపోయింది. దీంతో ఈ సర్వీసును రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 211 మంది ప్రయాణికులతో శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన బోయింగ్ 777–200ఎల్ఆర్ విమానం ముంబైకి చేరుకో వాల్సి ఉంది. శాన్ఫ్రాన్సిస్కో నుంచి వస్తూ పాకిస్తాన్ గగనతలం మీదుగా ముంబైకి చేరుకో వాల్సి ఉంటుంది.అయితే, పాక్ తన గగనతలాన్ని భారతీయ సర్వీసులకు మూసి వేసిన కారణంగా ఈ విమానం నేరుగా రావడం కుదర్లేదు. దాంతో చుట్టూతిరిగి తొలుత కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. రాత్రి 2 గంటల సమయంలో టేకాఫ్ తీసుకోవాల్సి ఉండగా ఒక ఇంజన్ మొరాయించింది. ఇంజనీర్లు మూడు గంటలపాటు శ్రమించినా ఫలితం లేకపోవడంతో ఆ సర్వీస్‌ను రద్దుచేశారు. కొందరిని ఇతర విమానాల్లో ముంబైకి పంపించారు.ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుముంబై: మస్కట్–ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో, విమానాన్ని అధికారులు నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయించి, తనిఖీలు చేపట్టారు. బెదిరింపు వట్టిదేనని ధ్రువీకరించుకున్నాక విమానం తిరిగి గమ్యస్థానానికి చేరుకుంది. మస్కట్‌లో బయలు దేరిన ఈ విమానంలో 157 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం విమానం కోచిలో ల్యాండయ్యింది. తిరిగి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానంలో బాంబు ఉందని బెదిరింపు మెయిల్ వచ్చింది. -
అందుకే లండన్ విమానం రద్దు చేశాం: ఎయిరిండియా క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు హడలెత్తిస్తున్నాయి. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత బయట పడుతున్న సాంకేతిక లోపాల ఘటనలు ‘వామ్మో.. ఎయిరిండియా’ అనేలా చేస్తున్నాయి. తాజాగా.. మంగళవారం మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి రద్దయ్యిందనే వార్తలు రాగా.. ఎయిరిండియా అందులో నిజం లేదని వివరణ ఇచ్చుకుంది. ఆంగ్ల మీడియా సంస్థల కథనం ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిరియిండియా విమానంలో సాంకేతిక సమస్య బయటపడింది. మధ్యాహ్నం 1.10 గంటలకు AI 159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరాల్సి ఉండగా.. పైలట్ టేకాఫ్ కంటే ముందు సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో విమానంలోని 200 మంది ప్రయాణికులను దించేశారు. తొలుత సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన నిర్వాహకులు.. చివరకు ఫ్లైట్ సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. జూన్ 12వ తేదీన ఇదే రూట్లో ప్రయాణించే ఎయిరింయా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో ఏఐ 171 విమానాన్ని పూర్తిగా రద్దు చేసింది ఎయిరిండియా. దాని స్థానంలోనే AI 159 విమానానికి తీసుకు వచ్చింది. అయితే.. అనూహ్యంగా.. ఇవాళ ఆ విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తడం.. టేకాఫ్‌కి ముందే ఆ సమస్యను గుర్తించడం.. చివరకు సర్వీస్ రద్దు కావడం జరిగిపోయాయి. విమాన రద్దు నిర్ణయంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏఐ 159 విమాన రద్దుపై ఎయిరిండియా వివరణ ఇచ్చుకుంది. విమానం సిద్ధంగా లేకపోవడంతోనే రద్దు చేశామని స్పష్టత ఇచ్చింది. ప్రయాణికులకు హోటల్లో వసతు కల్పిస్తున్నామని, అడిగిన వారికి డబ్బులు సైతం వెనక్కి ఇస్తున్నామని, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడబోమని ఎయిరిండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. Air India crashed after taking off. The plane was seen struggling to gain altitude before crashing into a fire ball.. Over 200 people were on board..#AirIndiaCrash pic.twitter.com/xacH20AlSe— Sudhir Byaruhanga (@Sudhirntv) June 12, 2025 -
Air India: ఇంక ముందుకు వెళ్లడం మంచిది కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది!. మార్గం మధ్యలో ఈ విషయాన్ని పసిగట్టిన పైలట్.. వెంటనే అప్రమత్తం అయ్యారు. విమానాన్ని గమ్యస్థానానికి తీసుకురాకుండానే వెనక్కి తీసుకెళ్లి హాంకాంగ్‌లోనే ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐ 315 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ప్రయాణికులతో(ఎంత మంది అనేది తెలియాల్సి ఉంది) ఈ ఉదయం హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. అయితే 90 నిమిషాల ప్రయాణం తర్వాత.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. 🇮🇳🇭🇰🛫🛬🇭🇰Air India 315 requested to stay closer to Hong Kong citing technical reasons before deciding to return to HKIA."We don't want to continue further". 🔊 via https://t.co/E8ftHE3i9y📽️ via @flightradar24 https://t.co/XJjqSO9Lll pic.twitter.com/qWq3iXuVRW— Aaron Busch (@tripperhead) June 16, 2025ఇంకా ముందుకు వెళ్లడం కుదరదు అని చెబుతూ.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. చివరకు అక్కడే(హాంకాంగ్ ఎయిర్‌పోర్టులో) ల్యాండ్ చేశారు. విమానంలో హాంకాంగ్ నుంచి ఢిల్లీకి సుమారు 6గంటల ప్రయాణం పడుతుంది. పైలట్ మాటలకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. 🇮🇳 🇭🇰 🛫 🛬 🇭🇰 Air India 315 from Hong Kong to Delhi diverted back to Hong Kong after takeoff on Monday.The plane departed 3hrs and 26 minutes delayed, then returned to Hong Kong roughly an hour after takeoff. The flight was on a 7 year old Boeing 787-8 Dreamliner. pic.twitter.com/kTNvlcfMFV— Aaron Busch (@tripperhead) June 16, 2025ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టెక్నికల్ టీం సమస్యను గుర్తించే పనిలో ఉంది. ఈ ఘటనపైగానీ, విమానాన్ని రీషెడ్యూల్ చేయడంపైనగానీ ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం భారత్‌లో ఎయిరిండియాతో పాటు ఇండిగో విమానయాన సంస్థ బోయింగ్ 787 విమానాలను ఉపయోగిస్తోంది. 2025 గణాంకాల ప్రకారం.. ఎయిరిండియా 33 డ్రీమ్‌లైనర్ విమానాల్ని ఉపయోగిస్తోంది. అయితే జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమానయాన సంస్థ వరుస ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. ఆ కంపెనీ బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. అలాగే బాంబు బూచీ నేపథ్యంలోనే పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యాలతో.. అన్ని బోయింగ్ విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయించింది. -
ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్‌తో సంబంధాన్ని ఖండించిన టర్కీ
అంకారా: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ నిర్వహణతో తమకు సంబంధం లేదని టర్కీ స్పష్టం చేసింది. టర్కీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ సెంటర్ ఫర్ కౌంటర్ డిస్ఇన్ఫర్మేషన్ దీనిపై స్పందిస్తూ, బోయింగ్ 787-8 ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణను టర్కిష్ టెక్నిక్ నిర్వహించిందనే వాదనను ఖండించింది.అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానాన్ని టర్కిష్ టెక్నిక్ నిర్వహించిందనే వాదన తుర్కియే-భారత్ సంబంధాలను దెబ్బతీసేలా ఉందని , ఇది ప్రజల అభిప్రాయాన్ని తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశించిన తప్పుడు సమాచారమని టర్కీ యంత్రాంగం ‘ఎక్స్’లో పేర్కొంది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ కాంప్లెక్స్ ఆవరణలోకి కూలిపోయింది. The claim that ‘the maintenance of the Boeing 787-8 passenger aircraft was carried out by Turkish Technic’ following the crash of an Air India passenger aircraft during take-off is false.The claim that the crashed aircraft was maintained by Turkish Technic constitutes… pic.twitter.com/lmdjVKHMSo— Dezenformasyonla Mücadele Merkezi (@dmmiletisim) June 13, 2025‘2024-25 ఏడాదికి సంబంధించి ఎయిర్ ఇండియా, టర్కిష్ టెక్నిక్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం బీ777-రకం వైడ్-బాడీ విమానాలకు ప్రత్యేకంగా టర్కీలో నిర్వహణ సేవలు అందిస్తారు. అయితే ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఈ ఒప్పందం పరిధిలోకి రాదు. నేటి వరకూ టర్కిష్ టెక్నిక్ ఈ రకమైన ఏ ఎయిర్ ఇండియా విమానానికి నిర్వహణ సేవలు అందించలేదు’ అని టర్కీ అధికారులు పేర్కొన్నారు. దీనిపై మరిన్ని ఊహాగానాలను వ్యాపించకుండా ఉండేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు.‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో పాకిస్తాన్‌కు టర్కీ మద్దతు ఇచ్చిన దరిమిలా భారత్‌లోని తొమ్మిది విమానాశ్రయాలలో సేవలను అందించిన ఒక టర్కిష్ సంస్థ తన భద్రతా అనుమతిని కోల్పోంది. అలాగే మే 8న భారత్‌పై పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లలో ఎక్కువ భాగం టర్కీలో తయారయినవి అని తేలింది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో అప్రమత్తమైన టర్కీ.. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ నిర్వహణలో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: Air India Plane Crashed: మనవరాళ్లతో ఆడుకునేందుకు లండన్ బయలుదేరి.. -
లండన్‌కు చేరాక ఫోన్ చేస్తా..
ముంబై: అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల హృదయవిదారక విషాద గాథలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ క్యాబిన్ క్రూలో పనిచేసే మైథిలీ పాటిల్(23) తన తండ్రి మోరేశ్వర్ పాటిల్‌కు గురువారం మధ్యాహ్నం చివరిసారిగా ఫోన్ చేశారు. లండన్ చేరుకున్నాక మళ్లీ చేస్తానంటూ ఆయన్ను అనునయించారు. కానీ, కొద్ది గంటల్లోనే ఘోరం జరిగిపోయింది. ఆమె తన మాట నెరవేర్చకుండానే తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయారు. డ్రీమ్‌లైనర్‌లో క్రూ సిబ్బందిలో ప్రాణాలు కోల్పోయిన 12 మందిలో మైథిలి ఒకరు. అంతేకాదు, వీరిలో ఇద్దరు పైలట్లు సహా మొత్తం 9 మంది క్రూ సిబ్బంది మహారాష్ట్రకు చెందిన వారే కావడం గమనార్హం. నవా గ్రామానికి చెందిన మైథిలి రెండేళ్ల క్రితం ఎయిరిండియాలో జాయినయ్యారు. ఈమె తండ్రి మోరేశ్వర్పాటిల్ ఓఎన్జీసీ లేబర్ కాంట్రాక్టర్‌గా ఉన్నారు. లండన్ చేరుకున్న వెంటనే ఫోన్ చేస్తానంటూ మైథిలి దుర్ఘటనకు కొద్దిసేపటి ముందే తండ్రికి ఫోన్ చేసి చెప్పారని ఆమె బంధువు, నవా గ్రామ మాజీ సర్పంచి జితేంద్ర మాత్రే చెప్పారు. క్యాబిన్ క్రూ మరో సభ్యుడు దీపక్ పాఠక్ థానె పక్కనే ఉన్న బద్లాపూర్ నివాసి. ఎయిరిండియాలో 11 ఏళ్లుగా పనిచేస్తున్న పాఠక్ లండన్ వెళ్లేముందుకు తల్లికి ఫోన్ చేసి మాట్లాడారని ఆయన సోదరి చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన క్రూ సభ్యుడు అపర్ణా మహదిక్(43)కి కూడా ముంబై సమీప గోరెగావ్ ప్రాంతమే. ఈమె భర్త కూడా ఎయిరిండియా క్రూ సభ్యుడిగా పనిచేస్తున్నారు. అపర్ణకు ఎన్సీపీ నేత సునీల్ తత్కారేకు బంధువు. విమానం క్రూ సభ్యుల్లో ఒకరైన ఇర్ఫాన్ సమీర్ షేక్(22) రెండేళ్ల క్రితమే ఎయిరిండియాలో జాయినయ్యారు. ఈయన ఎన్నో కలలు కన్నారని కుటుంబసభ్యులు కన్నీరమున్నీరవుతున్నారు. షేక్ కుటుంబం పుణె నగరం పింప్రి చించ్వాడీలో ఉంటోంది. క్రూలో మరో సభ్యురాలు శ్రద్ధా ధావన్‌ది ములుండ్‌లోని వైశాలి నగర్. ధావన్ మరణ వార్త తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు డీఎన్ఏ నమూనాలు ఇచ్చేందుకు అహ్మదాబాద్‌కు వెళ్లారు. విమాన క్యాబిన్ క్రూ సభ్యుల్లో రోష్ని రాజేంద్ర సొంఘారె డొంబివిలి ప్రాంతంలో ఉంటుండగా, సాయినీత చక్రవర్తి జుహు కొలివాడకు చెందిన వారు. ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అయిన సొంఘారేకు ఇన్‌స్టాలో 54 వేలకు పైగా ఫాలోయర్లున్నారు. ప్రమాదంలో చనిపోయిన పైలట్ సుమీత్ పుష్కరాజ్ సభర్వాల్(56) ముంబైలోని పొవైలో జల్ వాయు విహార్‌లో వృద్ధులైన తల్లిదండ్రులతో ఉంటున్నారు. విమానం కో–పైలట్ క్లైవ్ కుందర్ది కూడా ముంబైనే. శాంటాక్రుజ్ ప్రాంతంలోని కలినాలో జెరోమ్ అపార్టుమెంట్లో నివసిస్తున్నారు. భర్తతో కలిసి గడపాలని.. గుజరాత్‌లోని మెహ్సనాకు చెందిన అంకితా పటేల్‌ది మరో విషాదం. ఈమెకు గతేడాది డిసెంబర్లో పెళ్లయింది. భర్త వసంత్ లండన్‌లో ప్రొవిజన్ స్టోర్ యజమాని. ఈ నూతన దంపతులు కలిసి గడిపింది కేవలం 12 రోజులు మాత్రమే. వసంత్ లండన్ వెళ్లిపోవడంతో, తనూ అక్కడికి వెళ్లి భర్తతో గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. తన తల్లిదండ్రులు, సోదరుడితోపాటు వసంత్ సోదరితో కలిసి వీసా కోసం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. అంకితను లండన్ పంపించేందుకు వీరంతా గురువారం విమానాశ్రయానికి వచ్చారు. ఆమెకు గుడ్ బై చెప్పి మెహ్సనాకు బయలుదేరిన కొద్దిసేపటికే ఘోరం జరిగిపోయిందని వసంత్ సోదరి ఆశాబెన్ పటేల్ చెప్పారు. వెంటనే తిరిగి వచ్చామన్నారు. గాట్విక్ విమానాశ్రయంలో భార్యకు ఘనస్వాగతం పలకాల్సిన వసంత్..బదులుగా ఆమె అవశేషాలను తీసుకునేందుకు వస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించేందుకు అధికారులు అంకిత సోదరుడి డీఎన్ఏ నమూనాలు తీసుకున్నట్లు వివరించారు. ప్రయాణాలంటే ఎంతో సరదా.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన నీరజ్ లవానియా(50), అపర్ణ దంపతులకు ప్రయాణాలంటే ఎంతో ఇష్టం. ఈ వేసవి సెలవుల్లో లండన్ వెళ్లాలనుకున్నారు. వీరితోపాటు 18 ఏళ్ల కుమార్తె కూడా వెళ్లాల్సి ఉంది. అయితే, ఒంటరిగా ఉండే 70 ఏళ్ల నీరజ్ తల్లిని చూసుకునేందుకని ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. లండన్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానమెక్కిన లవానియా దంపతులు ప్రాణాలు కోల్పోయారు. డిగ్రీ ఫైనలియర్ చదువుకుంటున్న వీరి కూతురు తల్లిదండ్రుల అవశేషాలను గుర్తుపట్టేందుకు అహ్మదాబాద్ వెళ్లి అధికారులకు డీఎన్ఏ నమూనా ఇచ్చారు. ఆగ్రాలోని అకోలాకు చెందిన నీరజ్ 1995లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ కోసమని వడోదరకు మకాం మార్చారు. చుట్టుపక్కల వారితో ఎంతో కలుపుగోలుగా ఉండే నీరజ్ మరణ వార్త విని అకోలా వాసులు సైతం విషాదంలో మునిగిపోయారు. విమాన ప్రయాణానికి కొద్దిసేపటి ముందే 1.30 గంటల సమయంలో తనతో నీరజ్ మాట్లాడాడని సోదరుడు సతీశ్ చెప్పారు. టీవీలో వచ్చిన వార్తను చూసి షాక్‌కు గురయ్యానన్నారు.కుమారుడి వద్ద గడిపేందుకని..డ్రీమ్‌లైనర్ ప్రమాద మృతుల్లో మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా వాసి మహదేవ్ పవార్(68), ఆశా(60) దంపతులు కూడా ఉన్నారు. సంగోలా తెహశీల్లోని హటిడ్ గ్రామానికి చెందిన మహదేవ్ గుజరాత్‌లోని నడియాడ్‌లోని టెక్స్టైల్ మిల్లులో పని చేసేవారు. ఈయనకు ఇద్దరు కుమారులు. ఒకరు అహ్మదాబాద్‌లో, మరొకరు లండన్‌లో ఉంటున్నారు. లండన్‌లో నివసిస్తున్న కుమారుడి వద్దకని బయలుదేరిన ఈ దంపతులు విమాన ప్రమాదం బారినపడ్డారు. వీరు అహ్మదాబాద్‌లో 15 ఏళ్లుగా నివసిస్తున్నారని సోలాపూర్ జిల్లా అధికారి ఒకరు తెలిపారు. ఈ దంపతులు ఇటీవలే హటిడ్లో ఉంటున్న బంధువుల వద్దకు వచ్చి వెళ్లారని చెప్పారు.భర్త బర్త్‌డే కోసం.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన హర్‌ప్రీత్ కౌర్ హొరొ(28) ఐటీ నిపుణురాలిగా బెంగళూరులో పనిచేస్తున్నారు. ఈమె భర్త రొబ్బీ హొరా లండన్‌లోని ఐటీ కంపెనీలో ఉద్యోగి. ఈనెల 16న రొబ్బీ పుట్టినరోజు. వాస్తవానికి హర్‌ప్రీత్ ఈ నెల 19న లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే, భర్త పుట్టిన రోజు వేడుక కోసమని ముందుగానే ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌లో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. లండన్ వెళ్లాక దంపతులు యూరప్ టూర్ కూడా ప్లాన్ చేసుకున్నారని బంధువులు చెప్పారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని, వీరి కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిపోయాయని బంధువులు చెప్పారు.టీస్టాల్ యజమాని 14 ఏళ్ల కుమారుడు.. డ్రీమ్‌లైనర్ ప్రమాదం అహ్మదాబాద్ మెఘానీనగర్ ప్రాంతం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌కు సమీపంలోని చెట్టు కింద టీకొట్టు నడుపుకునే కుటుంబంలో తీరని విషాదం నింపింది. విమానం కూలిన సమయంలో సీతా బెన్ టీ తయారు చేస్తుండగా ఆమె కుమారుడు 14 ఏళ్ల ఆకాశ్ పట్ని పక్కనే నిద్రిస్తున్నాడు. కూలిన విమాన లోహ శకలం ఒకటి వచ్చి ఆకాశ్ తలను తాకింది. ఆ వెంటనే చెలరేగిన మంటల్లో ఆకాశ్ మాడి మసయ్యాడు ఆకాశ్. కుమారుడిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంలో తల్లి సీతా బెన్ తీవ్రంగా గాయపడి ఆస్ప త్రిలో చికిత్స పొందుతోంది.అంతా బాగుందని చెప్పి అంతలోనే.. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉండే సురేశ్ మిస్త్రీ అహ్మదాబాద్ బీజే మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వద్ద డీఎన్ఏ నమూనా ఇచ్చేందుకు క్యూలో ఉన్నారు. ఈయన కుమార్తె 21 ఏళ్ల క్రినా మిస్త్రీ విమాన ప్రమాదంలో చనిపోయింది. వర్క్ వీసా రావడంతో ఏడాది క్రితం లండన్ వెళ్లిన క్రినా ఇటీవలే ఆనంద్‌కు తిరిగి వచ్చింది. వైద్య చికిత్స అనంతరం డ్రీమ్‌లైనర్‌లో లండన్ తిరిగి పయనమయ్యింది. విమానం ఎక్కాక కూడా తండ్రికి ఫోన్ చేసి నిశ్చింతగా ఇంటికి వెళ్లండంటూ ధైర్యం చెప్పింది. ఇంటికి వెళ్లాక దుర్వార్త తెలిసిందని, క్రినా ఇక లేదన్న విషయాన్ని నమ్మలేకపోతున్నట్లు సురేశ్ గద్గద స్వరంతో చెప్పారు.తిరిగొచ్చాక భారీగా వేడుక చేద్దామని..గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర విషాదంలో అసువులు బాసిన వారిలో భవిక్ మహేశ్వరి(26) అనే నవ వరుడు కూడా ఉన్నారు. లండన్‌లో పనిచేసే భవిక్ 15 రోజులక్రితమే వడోదరకు వచ్చారు. పెళ్లి చేసుకున్నాకే తిరిగి లండన్ వెళ్లాలని కుటుంబసభ్యులు పట్టుబట్టడంతో వారి కోరిక మేరకు జూన్ 10న ఓ యువతితో చాలా సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత నవ వధువును లండన్ పంపేందుకు ఏర్పాట్లు సైతం మొదలయ్యాయి. మరోసారి వివాహ వేడుకను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. నూతన వధువు సహా కుటుంబసభ్యులంతా గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో భవిక్‌కు వీడ్కోలు పలికారు. వారి తిరిగి ఇళ్లకు చేరుకున్నారో లేదో ఘోరం జరిగిపోయింది. ఈ విషాదాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని బంధువొకరు తెలిపారు.ఏకైక కెనడియన్ నిరాలీ పటేల్..అహ్మదాబాద్ విషాద బాధితుల్లో కెనడా పౌరురాలు ఒకరుండటం తెల్సిందే. ఈమె భారత సంతతికి చెందిన నిరాలీ పటేల్(32). టొరంటోని ఎటోబికోక్‌లో ఉండే నిరాలీ సోషల్ ట్రిప్‌లో భాగంగా భారత్‌కు వచ్చారు. నిరాలీ మరణవార్త తెల్సిన భర్త, ఏడాది వయస్సున్న కుమార్తెతో భారత్‌కు వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఈమె తల్లిదండ్రులు, సోదరుడి కుటుంబం బ్రాంప్టన్‌లో నివస్తున్నారు. భారత్‌లో 2016లో దంత వైద్యంలో డ్రిగీ పొందిన నిరాలీ 2019లో కెనడా వెళ్లారు. మిస్సిస్సౌగాలో డెంటల్ క్లినిక్ నడుపుతున్నారు. నిరాలీ మృతి పట్ల కెనడా ప్రధాని మార్క్ కార్నీ, విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ సంతాపం ప్రకటించారు. అంత్యక్రియలకు బయల్దేరి అనంతలోకాలకు అహ్మదాబాద్/నాగ్‌పూర్: అహ్మదాబాద్ నుంచి లండన్‌కు అంత్యక్రియల కోసం వెళ్తున్న కుటుంబంలోని ముగ్గురు విమాన ప్రమాదంలో మరణించారు. నాగపూర్‌కు చెందిన 32 ఏళ్ల యశా కామ్దార్కు నాలుగేళ్ల కిందట అహ్మదాబాద్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. అప్పటినుంచి ఆమె అహ్మదాబాద్‌లోనే నివసిస్తున్నారు. మామ కిషోర్ మోదా చాలాకాలంగా లండన్‌లో ఉంటున్నారు. ఆయన అంత్యక్రియల కోసం ఒకటిన్నరేళ్ల కొడుకు, 58 ఏళ్ల అత్త రక్షతో కలిసి ఆమె లండన్ బయల్దేరి ముగ్గురూ ప్రమాదానికి బలయ్యారు. దాంతో యశా కుటుంబం, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. నాగపూర్‌లోని ఆమె తల్లిదండ్రులు అహ్మదాబాద్ బయలుదేరారు.లండన్ నుంచి పూర్తిగా వచ్చేయాలనుకుని.. కోచి: విమాన ప్రమాదంతో మరణించిన 39 ఏళ్ల కేరళ నర్సు రంజితది మరో విషాద గాధ. కేరళ ప్రభుత్వ నర్సుగా చేసిన ఆమె సెలవు పెట్టి కొంతకాలం ఒమన్‌లో పని చేశాక బ్రిటన్ వెళ్లింది. లండన్‌లో నర్సుగా చేస్తోంది. కేరళలో కొత్తిల్లు కట్టుకుని కుటుంబానికి కొత్త జీవితం ఇవ్వాలని కలలు కంది. లండన్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి శాశ్వతంగా భారత్‌కు వచ్చేయాలనుకుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వారిని రంజిత తల్లి చూసుకుంటోంది. నాలుగు రోజుల క్రితమే కేరళ వచ్చింది. అక్కడ మళ్లీ తన ప్రభుత్వోద్యోగంలో చేరడానికి లాంఛనాలు పూర్తి చేసింది. లండన్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి సర్టిఫికెట్లు, సామగ్రి తెచ్చుకోవడానికి గురువారం చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లింది. లండన్‌కు ఎయిరిండియా విమానమెక్కి తిరిగిరాని లోకాలకు చేరింది. దాంతో పిల్లలు, తల్లి దిక్కులేనివారయ్యారు. కాగా, రంజితను కులపరంగా, లైంగికంగా వేధిస్తూ ఆన్లైన్లో అసభ్య పోస్టులు పెట్టిన కాసరగోడ్ జిల్లా వెల్లరికుందు డిప్యూటీ తహశీల్దార్ పవిత్రన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడని, మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. -
బోయింగ్ డ్రీమ్‌లైనర్ రహస్యాల్ని బయటపెట్టి..
అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంతో.. బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాలను ఇక మీదట భారత విమానయాన సంస్థలకు ఉపయోగించకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు.. ప్రమాదంపై విచారణ ముగిశాక అమెరికా వైడ్‌బాడీ ఎయిర్లైనర్తో సమీక్ష జరిపిన తర్వాతే ఏ నిర్ణయం అనేది ప్రకటించనుందని ఆంగ్ల మీడియా కథనాల సారాంశం. అయితే.. బోయింగ్ విమానం.. అందునా డ్రీమ్‌లైనర్(Dreamliner) ఎంత మాత్రం సురక్షితం కాదన్న ఆ సంస్థ వేగు, మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ స్టేట్మెంట్ ఇప్పుడు తాజా ప్రమాద నేపథ్యంలో తెర మీకు వచ్చింది. బోయింగ్‌లో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన బార్నెట్.. ఆయన 787 డ్రీమ్‌లైనర్ విమానాల భద్రతా లోపాలను బయటపెట్టి సంచలన చర్చకు దారి తీశారు. అయితే ఆయన సజీవంగా లేరు. 👉జాన్ బార్నెట్(John Barnett) 2024 మార్చిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సౌత్ కరోలీనా చార్లెస్టన్లో తన ట్రక్కులో ఆయన తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. అయితే ఆయనది ఆత్మహత్య కాదని.. ఆయన్ని హత్య చేశారని ఆయన సన్నిహితులు ఇప్పటికీ వాదిస్తుంటారు. అందుకు.. ‘‘ఈ పోరాటం ఇంకా ఎంతో కాలం చేయలేను’’ అంటూ ఆయన చేతిరాతతో దొరికిన నోట్‌ను ప్రస్తావిస్తుంటారు.👉ఆ నోట్ ఆధారంగా.. ఆయన కుటుంబ సభ్యులు బోయింగ్‌పై దావా వేశారు. ఆపై కొన్నాళ్లకు కంపెనీతో సెటిల్మెంట్ చేసుకుని ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. 👉787 డ్రీమ్ లైనర్ విమానం సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణానికి ఉపయోగించే అత్యాధునిక విమానం. అయితే ఆ విమానం అందుకు పనికి రాదన్నది బార్నెట్ వాదన. 👉బోయింగ్ సంస్థలో బార్నెట్ మూడు దశాబ్దాలకు పైగా పని చేశారు. 2010 నుండి 787 డ్రీమ్‌లైనర్‌ను తయారు చేస్తున్న నార్త్ చార్లెస్టన్ ప్లాంట్‌లో క్వాలిటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారు. అనారోగ్యంతో 2017లో పదవీ విరమణ చేశారు. సంస్థ నుంచి పదవీ విరమణ తర్వాత నుంచి మరణించేదాకా.. బోయింగ్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.ఏం చెప్పాడంటే.. 2019లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయింగ్ సంస్థ లోపాల గురించి బార్నెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగా లేని లోపభూయిస్ట భాగాలను ఉద్దేశపూర్వకంగా విమానంలో అమర్చారు. ఆక్సిజన్ వ్యవస్థలోని కొన్ని తీవ్రమైన సమస్యలను కనుగొన్నాం. అత్యవసర సమయాల్లో ప్రతీ నాలుగు ఆక్సిజన్ మాస్కుల్లో ఒకటి పనిచేయదు. వాస్తవానికి.. కొత్త విమానాన్ని నిర్మించే ప్రయత్నంలో సౌత్ కరోలినాలో అసెంబ్లింగ్ ప్రక్రియ హడావిడిగా జరిగింది. ఇది భద్రతపై కంపెనీని రాజీ పడేలా చేసింది’’ అంటూ చెప్పారాయన. అలాగే.. Photo Credits: Netflix👉ఇదే కాకుండా కార్మాగారంలోని వివిధ బాగాలను ట్రాక్ చేయడంలో కార్మికులు విఫలమయ్యారని, దీని వల్ల ఫాల్ట్ ఉన్న భాగాలు కనిపించకుండా పోయాయని తెలిపారు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2017లో యూఎస్ రెగ్యులేటర్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) సమీక్ష, బార్నెట్ వ్యక్తం చేసిన కొన్ని ఆందోళనల్ని సమర్థించింది. 👉2022లో నెట్ఫిక్స్ ‘డౌన్‌ఫాల్: ది కేస్ అగెనెస్ట్ బోయింగ్’ డాక్యుమెంటరీలో జాన్ బార్నెట్ కనిపించారు. ప్రత్యేకించి 737 మ్యాక్స్ ప్రమాదాల గురించి ఆయన చర్చించారు.👉2024 మొదట్లో.. అలస్కా ఎయిర్‌లైన్స్ తలుపులు ఊడిపడిన ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బోయింగ్ వైఫల్యాలను ఆయన ఎత్తి చూపించారు. చివరకు.. తన మరణానికి ముందు కూడా ఆయన కంపెనీకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చాడు. 👉అయితే, బోయింగ్ సంస్థ మాత్రం బార్నెట్ ఆరోపణల్ని ఖండించింది. తమ విమానాలు అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత ప్రమాణాలతో నిర్మితమవుతున్నాయని చెప్పింది. భద్రత, నాణ్యత, సమగ్రత బోయింగ్ విలువల్లో ప్రధానమైనవని కంపెనీ నొక్కి చెప్పింది. తాజాగా.. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంతో.. బోయింగ్ డ్రీమ్‌లైనర్‌పై బార్నెట్ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. -
పక్షి ఢీకొట్టిందా?
గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన బోయింగ్ 787–7 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాద దుర్ఘటనలో.. ఇంకా కారణాలు నిర్ధారణ కానప్పటికీ పక్షి ఢీకొట్టడం వల్లే ఇది జరిగిందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. భారత్‌లో 2015లో ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగింది. కత్రా నుండి వైష్ణోదేవి ఆలయానికి వెళుతున్న హెలికాప్టర్.. రాబందు ఢీకొనటంతో పల్టీలు కొట్టి, మంటలు చెలరేగి పైలట్‌తో సహా ఏడుగురు చనిపోయారు. రన్‌వేపై లేదా గాల్లో పక్షులు ఢీకొనడం వల్ల గతంలో మనదేశంలో అనేక విమాన ప్రమాద దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత ప్రమాదం జరిగిన అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో.. 2022తో పోలిస్తే 2023లో దాదాపు రెట్టింపునకు పైగా ఇలాంటి ప్రమాదాలు జరగడం గమనార్హం. 2022లో కేవలం 39 ప్రమాద ఘటనలే జరిగితే ఆ తరవాతి ఏడాది ఈ సంఖ్య 81కి పెరిగింది. ఢిల్లీ రన్‌వేపై 700సార్లు! పక్షులు ఢీకొన్న సంఘటనలు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యధికంగా జరిగాయి. 2018–2023 మధ్య ఆ రన్‌వేలపై 700 కేసులు నమోదయ్యాయి. 2023 డిసెంబరు 18న రాజ్యసభలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం.. భారతదేశంలో అ త్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు వన్యప్రాణు లు, ప్రధానంగా పక్షుల బెడదతో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని తెలుస్తోంది. గత ఏడాది ఎమిరేట్స్ విమానం ముంబైలో ఫ్లెమింగోల గుంపును ఢీకొట్టడంతో 39 పక్షులు చనిపోయాయి. పక్షులు తగిలితే ఎందుకు కూలిపోతాయి? నిజానికి పక్షుల తగిలినంత మాత్రానే విమానాలు కూలిపోవు. కొన్ని సందర్భాలలో ఇంజిన్ లేదా ఇతర భాగాలకు నష్టం వాటిల్లుతుంది. విమానాలు చాలా వేగంగా టేకాఫ్ అవుతాయి. పక్షులు, ముఖ్యంగా పెద్ద పక్షులు; ఇంజిన్ లేదా విండ్షిల్డ్లోకి ప్రవేశించే పక్షి సమూహాలు ఢీకొనడం వల్ల మాత్రం పెద్ద ముప్పే వాటిల్లవచ్చు. టేకాఫ్ దశలో ఇంజిన్ చాలా వేగంతో తిరుగుతున్నప్పుడు, విమానం తక్కువ ఎత్తులో ఉండగానే పక్షి ఢీకొన్నప్పుడు ఇంజిన్ ఫ్యాన్ బ్లేడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో ఇంజిన్ విఫలమై ప్రమాదం సంభవించవచ్చు. పక్షి ఢీకొట్టగానే పైలట్ దృష్టి చెదిరి ప్రమాదాలు జరుగుతుంటాయి. అన్ని పక్షులూ ముప్పుకాదు 1966–1989 మధ్య కాలంలో తీవ్రమైన విమాన నష్టానికి కారణమైన పక్షుల జాబితాలో రాబందులు ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేవి. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో వాటి వల్ల ముప్పు తగ్గింది. నేడు ప్రధానంగా బ్లాక్ కైట్స్ (డేగ జాతి), గబ్బిలాలు, ల్యాప్‌విగ్ పక్షులు ప్రమాదం కలిగించే జాబితాలోకి చేరాయి. 2020 జూన్‌లో ‘డిఫెన్స్ లైఫ్’సైన్స్ జర్నల్ లో ‘భారతదేశంలో విమానాలకు వన్యప్రాణుల తాకిడి’అనే శీర్షికతో ప్రచురితమైన అధ్యయన పత్రం ప్రకారం.. ఈ మూడు జాతుల పక్షులే ఇప్పుడు ప్రధానంగా రన్‌వేపై విమాన ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. 2012–2018 మధ్య భారతదేశంలో 3,665 వన్యప్రాణుల తాకిళ్లు సంభవించినట్లు ఈ పత్రం పేర్కొంది. వీటిల్లో 385 ఘటనలు విమాన నష్టానికి కారణం అయ్యాయి. 2005–2018 మధ్య మూడు సైనిక విమానాలు కూలిపోవటానికి బ్లాక్ కైట్స్ పక్షులే కారణం. -
Air India flight crash: ఆశలు బుగ్గిపాలు
ఉద్యోగరీత్యా వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఎలాగైనా తన కుటుంబాన్ని తన వద్దకు చేర్చుకుని హాయిగా జీవిద్దామని భావించిన ఓ భారతీయుని కల కలగానే మిగిలిపోయింది. అతని కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోయింది. విమాన ప్రమాద ఘటనలో ఈ హృదయవిదారక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీక్ జోషి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత ఆరేళ్లుగా లండన్‌లో పనిచేస్తున్నారు. అతని భార్య డాక్టర్ కౌమీ వ్యాస్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీళ్లకు ఎనిమిదేళ్ల కూతురు మిరాయా, ఐదేళ్ల కవల కుమారులు నకుల్, ప్రద్యుత్ ఉన్నారు. కుటుంబం మొత్తాన్నీ లండన్‌కు శాశ్వతంగా తీసుకురావాలన్న ప్రతీక్ ప్రయత్నాలు ఇటీవల సఫలమయ్యాయి. దీంతో కేవలం రెండ్రోజుల క్రితమే భార్య కోమీ తన డాక్టర్ ఉద్యోగానికి రాజీనామాచేసింది. కొద్దిరోజుల క్రితం ప్రతీక్ భారత్‌కు వచ్చి కుటుంబంతో సహా లండన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. బ్యాగులనీ ప్యాక్ చేసుకుని ఇరు కుటుంబాలకు టాటా బైబైలు చెప్పి అందమైన భవిష్యత్తుపై కలలలో ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. లండన్‌కు వెళ్లే విమానం ఎక్కగానే తమ తమ సీట్లలో కూర్చొని ఒక అందమైన సెల్ఫీతీసుకున్నారు. భార్యాభర్త పక్క సీట్టలో, కవల సోదరులు, సోదరి మరో సీట్లో కూర్చుని నవ్వుతూ దిగిన ఫొటోను బంధువులకు వెంటనే పంపేశారు. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నామనుకున్నారుగానీ సమిధలౌతామని అస్సలు ఊహించి ఉండరు. ప్రమాదంలో ఎగసిన అగ్నికీలలో కుటుంబం మొత్తం కాలిబూడిదైంది. రెప్పపాటులో రంగుల ప్రపంచం మసిబారిపోయి నుసిగా మారింది. జీవితం క్షణభంగురం. నువ్వు నిర్మించిన, నువ్వు కలలుగన్న, నువ్వు ప్రేమించినదంతా ఒక సెకన్లో సమాధిగా మారిపోయింది. అందుకే ఇప్పుడే జీవించు, ఇప్పుడే ప్రేమించు. రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. జీవితం అస్థిరం. అది ముగిసేలోపే వీలైనంత ప్రేమను పెంచుదాం. పంచుదాం.. -
ప్రయాణికులపాలిట పీడకల... డ్రీమ్‌లైనర్
విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం కలలు రెక్కలు కట్టుకుని విమానం ఎక్కే వందలాది మంది ప్రయాణికులు తాజాగా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ పేరు చెప్పగానే హడలిపోతున్నారు. ఇది మార్గమధ్యంలో కూలిపోయి తమ కలలను కల్లలుచేస్తుందన్న ప్యాసింజర్ల భయాందోళల నడుమ ఈ మోడల్ విమానంపై సర్వత్రా చర్చ నెలకొంది. అమెరికా విమానతయారీరంగ దిగ్గజం బోయింగ్ 2011లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ఈ విమానం ఇప్పుడు అత్యంత అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. దీంతో ఈ మోడల్ విమానం గత విజయాలు, విశేషాలతోపాటు వివాదాలపర్వాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. వేర్వేరు చోట్ల తయారుచేసి మరోచోట విడిభాగాలను పటిష్టమైన ప్రామాణాలను పాటించకుండానే బిగిస్తున్నారని, డిజైన్ లోపాలున్నాయని ఈ మోడల్‌పై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్ పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి గమనిద్దాం. విలాసానికి మారుపేరు.. ఎప్పుడొచ్చింది? 2011లో విశ్వవిపణిలోకి తొలిసారిగా అడుగుపెట్టినప్పుడు బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ విమానంలోని సదుపాయాలు, సామర్థ్యాన్ని చూసిన వాళ్లంతా ఔరా అనేశారు. ఎక్కువ మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతోపాటు సుదూరాలకు ఇది అవలీలగా వెళ్లగలదు. కొనుగోలుచేసిన, నిర్వహణ సంస్థకు అనువుగా 242 నుంచి గరిష్టంగా 290 వరకు ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. సామర్థ్యం ఎంత? ఏకధాటిగా ఎక్కడా ఆగకుండా ఏకంగా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీంతో సుదూర నగరాల మధ్య సంధానకర్తగా ఇది మంచి పేరు తెచ్చుకుంది. అత్యంత పటిష్టమైన, అత్యంత తేలికైన మూలకాలతో విమాన నిర్మాణ విడిభాగాలను తయారుచేశారు. దీంతో మిగతా పోటీ సంస్థల మోడళ్లతో పోలిస్తే దీని బరువు తక్కువగా ఉంటుంది. మైలేజీపరంగా తక్కువ ఇంధనంతో పనిచేస్తుంది. టెక్నాలజీ ఎలాంటిది? కొత్తతరం డిజైన్, అధునాతన ఫ్లై–బై–వైర్ కంట్రోలర్లతో పనిచేస్తుంది. ప్రతి ఆదేశాన్ని పైలట్ ఇవ్వాల్సిన పనిలేకుండా గాల్లో కదిలే దిశ, ఒంపుకు అనుగుణంగా ఆటోమేటిక్‌గా కంప్యూటరే ఆదేశాలు ఇచ్చే వ్యవస్థ ఇందులో ఉంది. అత్యాధునిక ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లు దీనిలో ఉన్నాయి. సింథటిక్ విజన్ సిస్టమ్(ఎస్వీఎస్) సాయంతో కింద ఉన్న భూభాగాన్ని త్రిమితీయ(3డీ) ఫొటోలు తీసి ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో రన్‌వేపై పక్షులు, ఎయిర్పోర్ట్ వస్తువులు ఏమైనా ఉన్నాయోలేదో వెంటనే అలర్ట్చేస్తుంది. మంచుదుప్పటి కప్పుకున్నా, భీకర వర్షం పడుతున్నా రన్‌వే పరిసరాలను స్పష్టంగా చూపిస్తుంది. ఇంకెన్ని ఫీచర్లు ఉన్నాయి? ప్రయాణికుల సీటింగ్ క్యాబిన్, కాక్‌పిట్, కార్గో సెక్షన్లు అన్నింటిపైనా సమీకృత పర్యవేక్షణ ఉండేలా ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ ఏవియానిక్స్(ఐఎంఏ) విధానంతో విమానం పనిచేస్తుంది. ఆక్సిజన్ పీడనం, ఇంధన లీకేజీలు, హఠాత్తుగా ప్రయాణ ఎత్తు తగ్గడం, పిడుగులతో కుదుపులకు లోనవడం వంటి సందర్బాల్లో వెనువెంటనే ఆటోమేషన్‌లో తనంతట తానుగా సర్దుబాటు చేసుకునే వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. మరి లోపాలేంటి? తొలిరోజుల్లో నవతరం విమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన 787–8 డ్రీమ్‌లైనర్ నెమ్మదిగా విమర్శల సుడిగుండంలో పడింది. 2013లో ఈ మోడల్ విమానాల్లో లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోయాయి. దీంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్(ఎఫ్ఏఏ) వీటి రాకపోకలను స్తంభింపజేసింది. విమానం మధ్యలోని ప్రధాన విడిభాగాన్ని ఇతర భాగాలను అనుసంధానించేటప్పుడు సరైన ప్రమాణాలను పాటించట్లేరని 2019లో తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి. బిగింపుల మధ్య అతుకులు సరిగా పూడ్చట్లేరని, ఇందుకు కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కూడా తోడైందని వెల్లడైంది. దీంతో తరలింపు కోసం వాడిన బోల్ట్‌లు ఆ తర్వాత సైతం జాయింట్ల వద్ద అలాగే ఉండిపోయి మొత్తం వ్యవస్థకే సమస్యాత్మకంగా మారుతున్నాయి. సమీక్ష జరిపాకే ఎయిర్‌లైన్స్‌లకు కొత్త విమానాలను డెలివరీ చేయాలని ఎఫ్ఏఏ ఆదేశించడంత 2021 జనవరి నుంచి 2022 ఆగస్ట్‌దాకా 787 సిరీస్‌ల డెలివరీ ఆగిపోయింది.లోపాలను ఎత్తిచూపిన సీనియర్ ఉద్యోగులు ఏళ్ల తరబడి బోయింగ్ సంస్థలో పనిచేసిన సీనియర్ ఇంజినీర్లు ఈ మోడల్ విమానాల్లో లోపాలు ఉన్నట్లు పలుమార్లు బహిరంగంగా చెప్పారు. బోయింగ్ సంస్థలో ఇంజనీర్‌గా 17 ఏళ్లపాటు పనిచేసిన మాజీ ఉద్యోగి సామ్ సలేహ్‌పౌర్ 2024లో ఎఫ్ఏఏకు ఫిర్యాదు కూడా చేశారు. ‘‘విడిభాగాల ఉత్పత్తి దశలో బోయింగ్ అడ్డదారులు తొక్కుతోంది. విడిభాగాల బిగింపు సమయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలను పాటించట్లేదు. హడావిడిగా తుది ఆమోద ముద్ర వేసేలా ఇంజనీరింగ్ సిబ్బందిపై ఒత్తిడి చేస్తోంది. సరైన బిగింపు లేకపోవడం వల్ల విమానం పాతబడేకొద్దీ లోపం అనేది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అసెంబ్లీ యూనిట్లలో సిబ్బంది అడవిలో టార్జాన్ మాదిరిగా ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా మారుతూ పనిని సవ్యంగా చేయట్లేరని సంస్థకు ఎన్నోసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. 2020 ఏడాది నుంచి మూడుసార్లు సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తే నన్ను ‘నోరు మూస్కో’అన్నారు. ఇన్ని లోపాలతో తయారైన ఈ లోహ విహంగాలు టిక్ టిక్ శబ్దం చేసే టైంబాంబులే. రక్షణ, భద్రతా సంస్కృతికి బోయింగ్ తిలోదకాలిస్తోంది’’అని సలేహ్‌పౌర్ ఆరోపించారు.సమస్యలు ఎత్తిచూపి శాశ్వత నిద్రలోకి.. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్‌గా 32 ఏళ్లు బోయింగ్‌లో పనిచేసిన జాన్ బార్నెట్ సైతం పలు లోపాలను ఎత్తిచూపారు. ‘‘అత్యధిక పని ఒత్తిడి కారణంగా సిబ్బంది.. తయారీ లోపాలున్నాసరే ఆయా భాగాలను బిగించేస్తున్నారు. ఆక్సీజన్ వ్యవస్థల్లో ఇలాంటి లోపాలను గుర్తించా. ప్రతి నాలుగింట ఒక ఎమర్జెన్సీ బ్రీతింగ్ మాస్్కలో లోపం ఉంది. వాడేటప్పుడు ఇవి విఫలమవడం ఖాయం’’అని అన్నాడు. ఈ లోపాలను బయటపెట్టినందుకు ఈయనపై కేసు నమోదైంది. తర్వాత ఈయన ఆత్మహత్యచేసుకున్నారు. విమానాల్లో లోపాల ను క్వాలిటీ ఆడిటర్ జాషువా డీన్ సైతం బయటపెట్టారు. తర్వాత ఆయన సైతం అనారోగ్య సమస్యలతో చనిపోయారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డ్రీమ్‌లైనర్ విమానం.. మళ్లీ తుస్!
డ్రీమ్ లైనర్ విమానంలో మళ్లీ సమస్య తలెత్తింది. జపాన్ డ్రీమ్‌లైనర్ విమానం ఇంజన్ వేడెక్కడంతో కౌలాలంపూర్ నుంచి బయల్దేరిన విమానం.. గంటలోపే వెనక్కి తిరిగి వచ్చేసింది. ఆల్ నిప్పన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అనేక ఇబ్బందులను చవిచూస్తున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ తాజా ఘటనలతో మరో సమస్యలో పడినట్లు జపనీస్ ఎయిర్ లైన్స్ చెబుతోంది. కుడి ఇంజన్లో సమస్య వచ్చే సమయానికి విమానంలో 203 మంది ప్రయాణికులతో పాటు, 11 మంది సిబ్బంది ఉన్నారు. ఉదయం 8 గంటలకు కౌలాలంపూర్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం ఇంజన్ తీవ్రంగా వేడెక్కడంతో అప్రమత్తమైన సిబ్బంది.. 9.30 గంటల ప్రాంతంలో కౌలాలంపూర్‌లో మళ్లీ ల్యాండ్ చేశారని అధికారులు తెలియజేశారు. ప్రమాదాన్ని గుర్తించి అత్యవసరంగా దింపేయడంతో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, పెద్ద ముప్పు తప్పిందని తెలిపారు. మధ్యాహ్నం 3.15 గంటలకు విమానం నరితా ఎయిర్ పోర్టుకు చేరాల్సి ఉండగా.. ఉన్నట్లుండి విమానంలోని కుడి ఇంజన్లో ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో గుర్తించిన సిబ్బంది విమానాన్ని వెనక్కి తిప్పాల్సివచ్చిందని ఎయిర్ వేస్ ప్రతినిధి షోచిరో హోరీ తెలిపారు. అయితే అత్యధిక వేడి సమస్య ఎందుకు తలెత్తిందన్న విషయంపై విచారిస్తున్నట్లు తెలిపారు. ఇంధన వాడకాన్ని తగ్గించడంలో భాగంగా తేలికైన మిశ్రమ పదార్థాలతో డ్రీమ్ లైనర్ విమానాలను తయారు చేశారు. అభివృద్ధి దశలో వచ్చిన అనేక సమస్యలను దాటి ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ (ఏఎన్ఏ) 2011లో తొలి వాణిజ్య విమానాన్ని పరిచయం చేసింది. అనంతరం 2013లో డ్రీమ్‌లైనర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక విద్యుత్ సమస్య తలెత్తింది. సంవత్సరం మొదట్లో బ్యాటరీ సమస్యతో అనేక విమానాల్లో సమస్యలు తెలత్తగా, ఒక విమానం బ్యాటరీ వేడెక్కడంతో అగ్నిప్రమాదం కూడా సంభవించింది. దీంతో లోపాలను సరిదిద్దేందుకు ఓ పక్క ప్రయత్నాలు జరుగుతుండగా తాజాగా కౌలాలంపూర్ విమానం ఘటన వెలుగుచూసింది.