ఎయిరిండియాకు నటుడి సపోర్ట్‌.. ఫ్రీ టికెట్‌ ఇచ్చారా? | Vir Das Supports Air India Later Deletes Tweet | Sakshi
Sakshi News home page

Vir Das: విమానంలో కూర్చోని సీటు లేదు, ఎయిరిండియాకే నా సపోర్ట్‌.. నెటిజన్ల ఆగ్రహం

Jun 21 2025 12:49 PM | Updated on Jun 21 2025 2:38 PM

Vir Das Supports Air India Later Deletes Tweet

బాలీవుడ్‌ నటుడు, కమెడియన్‌ విర్‌ దాస్‌ (Vir Das) చిక్కుల్లో పడ్డాడు. ఎయిరిండియాకు సపోర్ట్‌ చేస్తూ ట్వీట్‌ చేయడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సహా 241 మంది మరణించారు. అంతమంది చావుకు కారణమైన ఎయిరిండియాను పొగుడుతూ తాజాగా అతడు ఓ ట్వీట్‌ వేశాడు.

పీఆర్‌ స్టంట్‌?
నేను లండన్‌ నుంచి ఇంటికి ఎయిరిండియా (Air India) విమానంలోనే వచ్చాను. నాకెంతో గొప్పగా అనిపించింది. సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. వారిది ఎంతో మంచి మనసు అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు ఫ్రీ టికెట్‌ ఇచ్చారా?, ఈ చెత్త పీఆర్‌ స్టంట్‌ చేసేవారికి నేను చెప్పేది ఒక్కటే.. ఇలాంటి సమయంలో ఈ ట్వీట్లు వేయడం బాధాకరం. మీ స్థాయిని మీరే తగ్గించేసుకుంటున్నారు అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మా తాత..
దాంతో విర్‌ దాస్‌.. తనది పీఆర్‌ స్టంట్‌ కాదని వివరణ ఇచ్చాడు. ఎయిరిండియాకు నేనెందుకు సపోర్ట్‌ చేస్తున్నానో మీకు చెప్తాను.. మా తాత ఎయిరిండియాలోనే పని చేసేవాడు. ఆ సంస్థ విమానాల్లోనే నేను నలుమూలలా ప్రయాణించాను. ఆ విమానాల్లో నేను కూర్చోని సీటు అంటూ లేదు. అయితే, ఈ ఎయిరిండియాలో కొన్ని సమస్యలున్నాయి. కానీ, ఏ సిబ్బంది కూడా మిమ్మల్ని చులకనగా చూడరు. నవ్వుతూ ఆహ్వానిస్తారు. వారిని కూడా ఈ విమాన ప్రమాదంలో మనం కోల్పోయాం. ఈ నష్టాన్నెందుకు ఎవరూ గుర్తించడం లేదు. నేను మాత్రం వారికి మద్దతిస్తున్నాను అని క్లారిటీ ఇచ్చాడు. అనంతరం ఈ ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు.

అప్పుడు కూడా ఇంతే!
జూన్‌ 12న అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం జరిగినప్పుడు కూడా విర్‌ దాస్‌ ఎయిరిండియాకు సపోర్ట్‌ ఇచ్చాడు. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన రోజు ఇది! వారి కుటుంబాలకు ఇదే నా ప్రగాఢ సానుభూతి. విమాన సిబ్బందికి కూడా నా సపోర్ట్‌ తెలియజేస్తున్నాను. నా జీవితం మొత్తం ఎయిరిండియాలోనే తిరిగాను. ఇక్కడ సమస్యలు లేవని కాదు, కానీ, ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదు. కానీ, ఎయిరిండియాలో పనిచేసే సిబ్బంది బెస్ట్‌ క్రూ అని మాత్రం బాగా తెలుసు. అసలు ఈ విషాదం ఎలా జరిగిందనేది సమయమే నిర్ధారిస్తుంది. పని చేస్తున్న ప్రదేశంలోనే ప్రాణాలు కోల్పోవడం ఎంత బాధాకరమో ఊహకు అందకుండా ఉంది అని ట్వీట్‌ చేశాడు.

 

 

చదవండి: కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా?

Advertisement
 
Advertisement
Advertisement