
రాజకీయ నాయకులు కూడా వినోదం కోసం సినిమా చూస్తుంటారు. వాళ్లకూ అభిమాన హీరోహీరోయిన్లు ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు తమ అభిమాన నటీనటులను కలుస్తుంటారు. కొంతమంది అయితే ఏ స్థాయిలో ఉన్నా.. తమ అభిమాన నటీనటులు కనిపిస్తే చాలు తమ హోదాని మరచి సాధారణ అభిమానిలాగే వ్యవహరిస్తారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ఎంపీ మహువా మొయిత్రా కూడా అలానే ప్రవర్తించారు.
ఇండియా టుడే చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ నటుడి గురించి, అతన్ని కలిసేందుకు చేసిన ప్రయత్నాల గురించి చెబుతూ.. సిగ్గు పడిపోయింది. పార్లమెంట్‌లో జంకు లేకుంగా గంభీరంగా మాట్లాడుతూ ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న మహువా మొయిత్రా.. ఇలా సిగ్గు పడుతూ మాట్లాడడం చూసి వీక్షకులు అవాక్కయ్యారు. ఇంతకీ మహువా మనసుకు నచ్చిన నటుడి పేరు చెప్పలేదు కదా.. విలక్షణమైన పాత్రలు పోషిస్తూ బాలీవుడ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న పంకజ్ త్రిపాఠినే ఆమె ఫేవరేట్ యాక్టర్. అతనితో కలిసి కాఫీ తాగేందుకు చాలా ప్రయత్నాలు చేసిందట. చివరకు లేఖ కూడా రాశానని.. కానీ రిప్లై రాలేదని మహువా చెప్పుకొచ్చింది.
యాంకర్‌తో కబురు..
పంకజ్ త్రిపాఠి నటన అంటే నాకు చాలా ఇష్టం. బయట కూల్గా కనిపిస్తాడు కానీ తెరపై మాత్రం భయంకరమైన పాత్రల్లో కనిపిస్తాడు. మిర్జాపూర్ వెబ్ సిరీస్‌లో ఆయన అద్భుతమైన విలనిజం పండించాడు. ఒకసారి అతన్ని కలిసేందుకు ప్రయత్నించాడు. అతనితో కలిసి కాఫీ తాగాలని ఉందని లేఖ రాసి.. అతన్ని ఇంటర్వ్యూ చేయబోయే యాంకర్ ద్వారా ఆ లేఖని అందించాను. కానీ ఆయన నుంచి రిప్లై రాకపోవడంతో నిరాశ చెందాను.
సహచర ఎంపీ సహాయంతో..
ఎంపీ అయిన తర్వాత సహచర ఎంపీ, నటుడు రవి కిషన్తో నా క్రష్ గురించి చెప్పాను. పంకజ్ త్రిపాఠి నటన అంటే చాలా ఇష్టమని , ఇలా లేఖ కూడా రాశనని చెప్పాను. అతను వెంటనే ఫోన్ చేసి పంకజ్తో మాట్లాడించాడు. అతనితో మాట్లాడే సమయంలో తెలియకుండానే నేను సిగ్గుపడిపోయాను. లేఖ రాసిన విషయాన్ని కూడా గుర్తు చేశాను’ అని ఎంపీ మహువా మొయిత్రా చెప్పుకొచ్చింది.
పంకజ్ త్రిపాఠి విషయానికొస్తే.. 2004లో ఆయన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2012లో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌తో అన్ని భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒకవైపు వెబ్ సిరీస్‌లు మరోవైపు సినిమాలు చేస్తూ బీజీ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. ఇటీవల ఆయన మైన్ హీరా అనే సినిమాలో ఒక హీరోగా కనిపించాడు.