
తమన్నా.. ఈ పేరు చెప్పగానే ఒకప్పుడు హీరోయిన్‌గా చేసిన సినిమాలు గుర్తొచ్చేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే మాత్రం ఐటమ్ సాంగ్స్ గుర్తొస్తున్నాయి. ఎందుకంటే 'కావాలయ్యా', 'ఆజ్ కీ రాత్' తదితర గీతాలతో తెగ వైరల్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్, నార్త్‌లో ఈ తరహా సాంగ్స్ చేయడం వల్ల తనకొచ్చిన క్రేజ్ గురించి మాట్లాడింది. ఎంతోమంది పిల్లలు తన పాటలు చూస్తూ అన్నం తింటున్నారని చెప్పుకొచ్చింది.
'ఓ పిల్లాడు నా పాట చూస్తూ తింటుంటే అలానే చూడనివ్వండి' అని తమన్నా చెప్పింది. మీరు ఏ సాంగ్ గురించి మాట్లాడుతున్నారని హోస్ట్ అడగ్గా.. 'స్త్రీ 2 మూవీలో ఆజ్ కీ రాత్ గురించి' అని తమన్నా బదులిచ్చింది. అలానే 'ఎందరో తల్లులు నాకు ఫోన్ చేసి, మా బిడ్డ మీ పాట వింటూ, చూస్తే తప్పితే భోజనం చేయట్లేదు అని చెప్పారో లెక్కలేదు. పిల్లలకు నచ్చింది కనిపిస్తే అలానే చేస్తుంటారుగా' అని తన ఆనందాన్ని పంచుకుంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)
తమన్నా కామెంట్స్‌పై స్పందించిన హోస్ట్.. ఇది తల్లులు చింతించాల్సిన విషయమే అని అన్నాడు. దీనికి కౌంటర్ ఇచ్చిన తమన్నా.. 'తమ పిల్లలు సరిగా తింటున్నారా లేదా అని తల్లులు చింతించాలి. అదే వాళ్లకు ముఖ్యం. అంతే కానీ ఏ సాంగ్ వింటున్నారనేది కాదు. అయినా ఏడాది పిల్లలకు లిరిక్స్ ఏం అర్థమవుతాయి? వాళ్లు సంగీతం మాత్రమే ఎంజాయ్ చేస్తారు. కొన్నిసార్లు మనం కూడా సినిమాల్ని మర్చిపోతాం కానీ పాటలు గుర్తుంచుకుంటాగా. అలానే ఇది' అని చెప్పింది.
తమన్నా చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్‌లో మంచి బీట్ ఉన్న పాటలంటే ఎక్కువగా స్పెషల్ సాంగ్సే ఉంటాయి. వాటిని చూపిస్తూనే చాలామంది తల్లలు.. పిల్లలకు అన్నం తినిపిస్తున్నారేమో? ఇకపోతే తమన్నా కెరీర్ విషయానికొస్తే.. చివరగా తెలుగులో 'ఓదెల 2' సినిమా చేసింది. ప్రస్తుతం హిందీలో మూడు మూవీస్ చేస్తోంది. గతేడాది వరకు నటుడు విజయ్ వర్మతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. కొన్నాళ్ల క్రితం వీళ్లకు బ్రేకప్ అయింది. ప్రస్తుతానికైతే తమన్నాకు సినిమాలే ప్రపంచం.
(ఇదీ చదవండి: ఆటిట్యూడ్ హీరోలపై 'కూలీ' నిర్మాత సెటైర్లు)