విస్తరణ బాటలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ | Air India Express to Expand Fleet and Add New Routes | Sakshi
Sakshi News home page

విస్తరణ బాటలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

Dec 7 2024 4:53 AM | Updated on Dec 7 2024 4:53 AM

Air India Express to Expand Fleet and Add New Routes

న్యూఢిల్లీ: బడ్జెట్‌ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ .. గల్ఫ్, మధ్య ప్రాచ్యంలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు ఆగ్నేయాసియాలోనూ తమ కార్యకలాపాలను విస్తరించనుంది. బ్యాంకాక్, సింగపూర్, కొలంబో తదితర కొత్త రూట్లను పరిశీలిస్తున్నట్లు సంస్థ ఎండీ అలోక్‌ సింగ్‌ తెలిపారు. 2025 మార్చి వేసవి షెడ్యూల్‌లో ఖాట్మండూ రూట్‌లో సరీ్వసులు మొదలుపెడతామని, వచ్చే ఆర్థిక సంవత్సరం లేదా ఆపై సంవత్సరం వియత్నాంకి ఫ్లయిట్స్‌ను ప్రారంభించే అవకాశం ఉందని ఆయన వివరించారు. 

ప్రధానంగా 5.5–6 గంటల ప్రయాణ దూరం ఉండే రూట్లు, ద్వితీయ .. తృతీయ శ్రేణి నగరాలకు సరీ్వసులపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా కోల్‌కతా నుంచి ఢాకాకు డైరెక్ట్‌ ఫ్లయిట్స్‌ ప్రణాళికను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి నాటికి తమ విమానాల సంఖ్యను ప్రస్తుతమున్న 90 నుంచి 100కి పెంచుకోనున్నట్లు సింగ్‌ చెప్పారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రస్తుతం దేశీయంగా 36, అంతర్జాతీయంగా 15 గమ్యస్థానాలకు నిత్యం 400 ఫ్లయిట్స్‌ నడుపుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement