ఎయిరిండియా అంటేనే వణికిపోతోంటే....పేల్చేస్తా అంటూ మహిళ వీరంగం! | Bengaluru Doctor Warns Crew After Fight Over Bag Space | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా అంటేనే వణికిపోతోంటే....పేల్చేస్తా అంటూ మహిళ వీరంగం!

Jun 20 2025 4:08 PM | Updated on Jun 20 2025 5:28 PM

Bengaluru Doctor Warns Crew After Fight Over Bag Space

ఎయిరిండియా విమానం కూలిన దుర్ఘటన తాలూకు విషాదం మన మనసుల్లోకి తొలగి పోక ముందే ఒక మహిళా ప్రయాణికురాలు అనుచితం ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ‘విమానం- క్రాష్‌’ అన్న పదాలు  వింటేనే ఉలిక్కి పడుతున్న ప్రస్తుత తరుణంలో స్వల్ప వివాదానికే  విమానాన్ని కూలిపోతుంది అంటూ అంటూ నానా గలాటా సృష్టించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు  జరిగిన ఈ సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది.


ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రిపోర్ట్‌ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) నుండి సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు ఈ సంఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన మహిళా ప్రయాణీకురాలు, వైద్యురాలు వ్యాస్ హిరాల్ మోహన్‌భాయ్ (36) బ్యాగ్‌ స్థలం కోసం విమాన సిబ్బందితో గొడవకు దిగింది. విమానంలోని తన సీటు 20Fలో కూర్చునే ముందు మొదటి వరుసలో తన  బ్యాగ్‌ వదిలి వెళ్ళిపోయింది. దీంతో దీన్ని ఆమె సీటు దగ్గర ఉన్న ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో ఉంచమని సిబ్బంది కోరారు.  అంతే ఆవేశంతో ఊగిపోతూ , "విమానం కూలిపోతుంది" అంటూ గొడవకు దిగింది.  క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది.  ఇది తప్పు అన్న తోటి ప్రయాణీకులపై కూడా అరిచిందిట. దీంతో  పైలట్ , సిబ్బంది భద్రతా సిబ్బంది మరియు CISF సిబ్బందికి సమాచారం అందించారు, వారు ఆమెను విమానం నుండి కిందికి దింపేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  విమానాన్ని కూల్చివేస్తామని బెదిరించిందన్న ఆరోపణలపై ఆ మహిళా వైద్యుడిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement