
అదృష్టం కొద్దీ బతికిపోయామన్న కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్
విమానంలో ఉన్న పలువురు ఎంపీలు
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సహా, పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులను కలవరపెట్టింది. విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నామని, అదృష్టం కొద్దీ బతికిపోయామని ఆయన సోమవారం తెలిపారు. ‘ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ 2455లో బయల్దేరాం.
నాతో పాటు పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులున్నారు. విమానం ఆలస్యంగా బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. ఫ్లైట్‌ను చెన్నై ఎయిర్‌పోర్టుకు మళ్లిస్తున్నట్లు కెపె్టన్ ప్రకటించారు. అందరిలోనూ భయం నెలకొంది. అక్కడా ల్యాండింగ్‌కు వెంటనే అనుమతి లభించకపోవడందో విమానం రెండు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ తరువాత చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. అందరం ఊపిరి పీల్చుకున్నాం’అని కేసీ వేణుగోపాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కెపె్టన్ ముందు చూపువల్ల తాము బతికి బయటపడ్డామని, అదృష్టవంతులమని చ్పెఆరు. అయితే.. విమానంలో భద్రత అదృష్టం మీద ఆధారపడి ఉండటం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డీజీసీఏ, కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. అయితే వేణుగోపాల్ ప్రకటనపై ఎయిరిండియా స్పందించింది. ఆదివారం రాత్రి కేరళలోని తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిరిండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా చెన్నైకి అత్యవసరంగా మళ్లించాల్సి వచ్చిందని తెలిపింది.
అయితే.. రన్‌వేపై మరో విమానం ఉండటం వల్ల విమానంగాల్లో చక్కర్లు కొట్టలేదని, చెన్నై ఏటీసీ సూచన మేరకే అలా చేయాల్సి వచి్చందని తెలిపింది. ‘ప్రియమైన వేణుగోపాల్‌గారు అనుమానిత సాంకేతిక సమస్య, అననుకూల వాతావరణం వల్ల చెన్నైకి మళ్లింపు జరిగింది. అయితే ల్యాండింగ్ ప్రయత్నంలో ఏటీసీ ఒక రౌండ్–అరౌండ్ సూచించింది. ఎలాంటి పరిస్థితులనైనా నిర్వహించేందుకు మా పైలట్లు బాగా శిక్షణ పొందారు. వారు ప్రామాణిక విధానాలను అనుసరించారు. అలాంటి అనుభవం కలవరపెడుతుందని మాకు అర్థమైంది. మళ్లింపు వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. భద్రత ఎల్లప్పుడూ మా ప్రాధాన్యత. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’అని పేర్కొంది.
కాగా, ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం.. ఆదివారం రాత్రి 7.15 నిమిషాలకు బయలుదేరాల్సిన విమానం 8:17 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరింది. 10:35 గంటలకు చెన్నైలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత సోమవారం తెల్లవారుజామున 1:40 గంటలకు బయలుదేరి 3:58 గంటలకు ఢిల్లీ చేరుకుంది.