దుష్ట శక్తులకు తల వంచేది లేదు | Mamata Banerjee tells party workers to resist evil forces | Sakshi
Sakshi News home page

దుష్ట శక్తులకు తల వంచేది లేదు

Jan 2 2026 6:28 AM | Updated on Jan 2 2026 6:28 AM

Mamata Banerjee tells party workers to resist evil forces

టీఎంసీ వ్యవస్థాపక దినం సందర్భంగా మమతా బెనర్జీ స్పష్టీకరణ

కోల్‌కతా: ప్రజల కోసం తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ చీఫ్, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ విషయంలో దుష్ట శక్తుల ఒత్తిళ్ల కు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. టీఎంసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఎక్స్‌లో ఈ మేరకు పలు పోస్టులు చేశారు. మా, మా తి, మనుష్‌(తల్లి, భూమి, ప్రజలు)లకు సేవే లక్ష్యంగా టీఎంసీ 1998 జనవరి ఒకటో తేదీన ఆవిర్భవించిందని ఆమె గుర్తు చేశారు. 

ఇప్పటికీ ప్రతి కార్యకర్త, ప్రతి మద్దతుదారు ఈ లక్ష్య సాధనకే కట్టుబడి పనిచేస్తున్నారని చెప్పారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన కార్యకర్తలకు ఆమె నివాళులర్పించారు. అసంఖ్యాక ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలే పార్టీకి రక్షగా నిలుస్తు న్నాయన్నారు. ప్రజల మద్దతే తమకు జీవనాధారమని, దేశంలోని ప్రతి వ్యక్తి కోసం జరిగే పోరాటంలో వెనకడుగు వేయ దని బెనర్జీ స్పష్టం చేశారు. ‘మేం ఏ దుష్ట శక్తులకూ తలవంచబోం. అన్ని రకాల పగ ప్రతీకారాలను పక్కన పెట్టి, సామాన్య ప్రజల కోసం జీవి తాంతం పోరాటం కొనసాగి స్తాం’అని మమత ప్రకటించా రు. 

పార్టీపై ప్రేమాదరాలను కురిపించే ప్రతి ఒక్కరికీ టీఎంసీ ఎక్స్‌లో ధన్యవాదాలు తెలి పింది. ప్రజల హక్కులను కాపాడేందుకు పోరాటాన్ని ఇకపైనా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను మట్టి కరిపిస్తామని ప్రతిన బూనింది. కాంగ్రెస్‌ను వీడిన మమతా బెనర్జీ 1998లో టీఎంసీని స్థాపించారు. బెంగాల్‌లో దశాబ్దాల వామపక్ష పాలనకు గట్టి సవాల్‌గా నిలిచారు. సీపీఎం 34 ఏళ్ల పాలనను అంతం చేసి, మమతా బెనర్జీ 2011లో సీఎం పీఠాన్ని అధిరోహించారు. అప్పటి నుంచి ఏకధాటిగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బెంగాల్‌లో పరిణామాలు వేగంగా మారుతున్న వేళ..మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికలు టీఎంసీకి నిర్ణాయకంగా మారనున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement