
కర్ణాటక: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో క్యాబిన్ సిబ్బందితో వాగ్వాదం జరిపి నిందించిన ప్రయాణికురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కెంపేగౌడ ఎయిర్‌పోర్టు నుంచి సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ఐఎక్స్ 2749 విమానం బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందు ఈ సంఘటన జరిగింది.
యలహంక సమీపంలోని శివనహళ్లి నివాసి వైద్యురాలు వ్యాస్ హిరాల్ మోహన్ భాయ్ తనకు కేటాయించిన సీట్ నంబర్– 20లో కూర్చోడానికి ముందు ముందు వరుసలో ఉన్న సీట్లో తన బ్యాగులను ఉంచింది. దీన్ని ప్రశ్నించిన సిబ్బందితో ఆమె తీవ్రంగా వాగ్వాదానికి దిగింది. అందరినీ నిందిస్తూ బాంబు పెట్టి విమానాన్ని పేల్చేస్తానని ఆగ్రహంతో ఊగిపోయింది. పైలట్, విమాన సిబ్బంది ఎంత నచ్చచెప్పినా ఆమె తగ్గలేదు. తోటి ప్రయాణికులతో కూడా గొడవ పడింది. దీంతో విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
#ViralVideo… pic.twitter.com/aQMeuyUyfj
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 19, 2025