అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్‌కు చెందిన వెంట్రుకల కుచ్చు వేలంలో 4,000 డాలర్లు (సుమారు రూ.3.3 లక్షలు) పలికింది. శనివారం రిచ్‌మండ్ ఆక్షన్స్ నిర్వహించిన వేలంలో దీనిని విక్రయించారు.
1799లో వాషింగ్టన్ మరణించడానికి కొద్దికాలం ముందు ఆయనకు విందు ఇచ్చిన జాన్ గాడ్స్‌బీకి ఈ వెంట్రుకలు చెందినవి. గాడ్స్‌బీ వారసుల నుంచి కలెక్టర్ జాన్ కె. లాటిమర్ వీటిని సేకరించారు. తాజా కొనుగోలుదారు వివరాలను వెల్లడించలేదు.
2021లో వాషింగ్టన్‌కు చెందిన మూడు వెంట్రుకలు వేలంలో దాదాపు 40,000 డాలర్లు పలికాయి. ఆయన పూర్వ నివాసమైన మౌంట్ వెర్నాన్‌లో ఇప్పటికీ కనీసం 50 వెంట్రుకల కుచ్చులను భద్రపరిచారు. వాషింగ్టన్‌కు చెందిన పలు వెంట్రుకల కుచ్చులు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ నివాసం మ్యూజియంగా కొనసాగుతోంది.
వాషింగ్టన్‌కు సంబంధించిన ఇతర చారిత్రక వస్తువులు కూడా వేలంలో భారీ ధరలు పలుకుతున్నాయి. ఈ ఏడాది జూలైలో 1776లో కాంటినెంటల్ ఆర్మీకి సైనికులను సమకూర్చాలని కోరుతూ ఆయన సంతకం చేసిన లేఖను వేలం వేయగా.. 1,09,800 డాలర్లు (సుమారు రూ.92 లక్షలు) లభించాయి.
ఇదీ చదవండి: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరో సంచలనం


