ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో వీరోచితంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం లభిచింది. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ప్రశంసలు కురిపించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. ఆయనను ఇజ్రాయెల్, భారత్‌తో పాటు ప్రపంచానికే హీరోగా అభివర్ణించారు. అంతేకాకుండా, ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జ్యోతి వెలిగించాలని ఆహ్వానించారు.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమ్మామ్ అల్-హమ్మామీ, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై గొడ్డలితో దాడి చేసి, విమానాన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విమానం కొద్ది సమయంలోనే వేల అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందికి దూసుకొచ్చింది. ఈ పరిస్థితిలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు వీలైంది. విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్లు పరిస్థితిని చక్కదిద్ది, సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా దించారు. ఈ ఘటనలో విమానంలోని 174 మంది ప్రాణాలు కాపాడిన కెప్టెన్ మచ్చర్ ధైర్యసాహసాలను పలువురు ప్రశంసించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆయన ధైర్యాన్ని కొనియాడారు.
ఈ నేపథ్యంలో కెప్టెన్ మచ్చర్‌తో మాట్లాడిన నెతన్యాహు, ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జ్యోతి వెలిగించేందుకు రావాలని ఆహ్వానించారు.
Prime Minister Benjamin Netanyahu in a conversation with the Indian pilot from the flight from Dubai, Captain Smit Machchhar: "You are a hero for Israel, India, and the entire world. I invite Prime Minister @NarendraModi and you to light a flame on Israeli Independence Day." 🇮🇱🇮🇳 During the emotional conversation that took place this evening, the Prime Minister asked Captain Machchhar how it all started, and Machchhar revealed new details about the terrifying moments in the cockpit.
— Prime Minister of Israel (@IsraeliPM) October 3, 2026


