కెప్టెన్ స్మిత్‌ మచ్చర్​పై దాడి.. ఆ గొడ్డలి వెనుక అసలు రహస్యం ఇదే! | Indian Pilot Smit Machchhar Injured in Mid-Air Cockpit Axe Attack on flydubai Flight | Sakshi
Sakshi News home page

కాక్‌ పిట్‌లో కెప్టెన్ స్మిత్‌ మచ్చర్​పై దాడి.. ఆ గొడ్డలి వెనుక అసలు రహస్యం ఇదే!

Oct 1 2026 4:00 PM | Updated on Oct 1 2026 4:31 PM

Indian Pilot Smit Machchhar Injured in Mid-Air Cockpit Axe Attack on flydubai Flight

ప్రాణాలకు తెగించి 170 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారతీయ సంతతి పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసమాన్య ధైర్యసాహసాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కాక్‌పిట్‌లోకి ఆ మారణాయుధం ఎలా వచ్చింది? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.

దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో గగనతలంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా కాక్‌పిట్‌లోనే ఓమన్‌కు చెందిన కో-పైలట్ రెచ్చిపోయాడు. అత్యవసర సమయాల్లో ఉపయోగించే ‘క్రాష్ యాక్స్’ (అగ్నిమాపక గొడ్డలి) తో ఫ్లైట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఊహించని పరిణామాతో విమానం ఒక్కసారిగా నింగి నుంచి కిందకు కూలిపోబోయి, చివరికి సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

ముప్పు కాక్‌పిట్ లోపలి నుంచే 
అమెరికాలో జరిగిన 9/11 మారణహోమం తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా కాక్‌పిట్ డోర్స్‌ను అత్యంత దృఢంగా, బయటి నుంచి ఎవరూ సులభంగా తెరవలేని విధంగా మార్చేశారు. అయితే, ఈసారి ముప్పు బయటి నుంచి కాకుండా కాక్‌పిట్ లోపలి నుంచే రావడంతో అంతర్జాతీయంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ స్పృహ కోల్పోయే ముందు కాక్‌పిట్ డోర్ తెరవడం వల్లే ప్రయాణికులు లోపలికి వచ్చి పెను ప్రమాదాన్ని నివారించగలిగారు.

 

కాక్‌పిట్‌లో గొడ్డలి ఎలా వచ్చింది?  
విమానం అంటేనే అత్యంత సురక్షితమైన ప్రాంతం. మరి అంతటి ప్రదేశంలో కో-పైలట్ దాడి చేయడానికి ఉపయోగించిన ‘క్రాష్ యాక్స్’ ఎలా వచ్చింది? దాన్ని ఎవరు తెచ్చారు? అనే దానిపై స్పష్టత వచ్చింది. దాడి అనంతరం ప్రారంభంలో కో-పైలట్ దాన్ని ఎక్కడి నుంచో తెచ్చి ఉంటాడని భావించారు. కానీ, అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం ప్రతి వాణిజ్య విమానం తయారయ్యేటప్పుడే ఫ్యాక్టరీలో ఈ ‘క్రాష్ యాక్స్’ను అమర్చుతారు. ప్రతి విమానంలో ఇది ఉండటం తప్పనిసరి.

దీనిని ఎందుకు ఉపయోగిస్తారు? 
విమానం గాల్లో ఉండగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినా, లేదా ఎలక్ట్రానిక్ ప్యానెల్స్ మొరాయించినా.. అత్యవసర సమయాల్లో పైలట్లు ప్యానెల్స్‌ను పగలగొట్టి బయటపడటానికి లేదా మంటలను ఆర్పడానికి ఈ గొడ్డలిని రక్షణ పరికరంగా వాడతారు.

Pilot Smit Machchhar Likely Attacked With Axe On flydubai Flight. Why It Was On Plane

9/11 దాడుల తర్వాతే మార్పు 
2001 సెప్టెంబర్ 11 నాటి ఉగ్రదాడికి ముందు ఈ గొడ్డళ్లను ప్రయాణికులు కూర్చునే ప్రధాన క్యాబిన్‌లో ఉంచేవారు. కానీ, ఆ ఉగ్రదాడి తర్వాత ప్రయాణికులు దీన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు భద్రతా సంస్థలు వీటిని నేరుగా కాక్‌పిట్‌లోకి మార్చాయి. అంటే పైలట్లకు అత్యవసర సమయంలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని కాక్‌పిట్‌లో ఉంచారు. కానీ, అదే గొడ్డలి ఇప్పుడు ఒక కో-పైలట్‌‌ చేతిలో తోటి పైలట్‌పైనే దాడికి ఉపయోగపడటం విమానయాన రంగంలో పెను కలకలం రేపుతోంది. 

నిందితుడు అరెస్ట్.. దర్యాప్తునకు ఆదేశం
ఈ దాడికి పాల్పడిన ఒమన్‌కు చెందిన కో-పైలట్‌‌ను అరెస్టు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. అయితే, ఈ దాడికి సంబంధించిన కచ్చితమైన ఉద్దేశ్యం ఇంకా తెలియరాలేదు. కాక్‌పిట్‌‌లోకి ప్రయాణికులు సకాలంలో ప్రవేశించి సాహసవంతంగా వ్యవహరించడం వల్ల మరో పెను విపత్తు (9/11 తరహా ఉగ్రదాడి) తప్పిందని నెతన్యాహు సీఎన్ఎన్‌తో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ వార్షికోత్సవానికి సరిగ్గా వారం రోజుల ముందు ఈ ఘటన జరగడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement