ఆ వీరుడిని రక్షించడానికి అలా చేయక తప్పలేదు..!: దంత వైద్యుడు | Dentist recalls 45 minutes of trying to save Smit Machchhars life | Sakshi
Sakshi News home page

ఫ్లై దుబాయ్‌ ఘటన..ఆ వీరుడిని రక్షించడానికి అలా చేయక తప్పలేదు..!

Oct 7 2026 2:49 PM | Updated on Oct 7 2026 3:04 PM

Dentist recalls 45 minutes of trying to save Smit Machchhars life

ఫ్లై దుబాయి విమానం ప్రమాదానికి గురికాకుండా ఎంతోమంది ప్రయాణికులు కాపాడిన రియల్‌ హీరో భారతీయ పైలెట్ స్మిత్ మచ్చార్‌పై యావత్తు ప్రపంచం వీరుడా అని కీర్తిస్తూ..ప్రసంసల వర్షం కురిపించింది. ఆయన సురక్షితంగా ఉండాలంటూ ప్రముఖులు నుంచి సామాన్యుల వరుకు ప్రతి ఒక్కరు ప్రార్థించారు. ఇలా అందరి మనసుల్లో సుస్థిరమైన స్థానం దక్కించుకున్న ఆ పైలట్‌ మచ్చార్‌ నాటి దుర్ఘటనలో ఆయన ఎదుర్కొన్ని ప్రమాద క్షణాల గురించి దంత వైద్యుడు డాక్టర్‌ షోటా ముసయేవ్‌ కళ్లకు కట్టినట్లు వివరించారు. 

ఇజ్రాయెల్‌కి చెందిన ఆ దంత వైద్యుడు ముసయేవ్‌ నాటి ‍ప్రమాద ఘటనను గుర్తు చేసుకుంటూ..వైద్య సహాయం కోసం అరుపులు కేకలు విని కాక్‌పీట్‌ వైపుకి వెళ్తుండగా నేలపై గాయపడి ఉన్న మచ్చార్‌ని చూసి హుటాహుటినా దగ్గరకు వెళ్లానని చెప్పారు. అతని తల, ఎడమ చేతి నుంచి తీవ్రమైన రక్తస్రావం అవుతోంది. ఆ గాయలపై ఒత్తిడి కలిగించేందుకు టీషర్ట్‌లను ఉపయోగించాల్సి వచ్చిందన్నారు. అలాగే రక్తస్రావాన్ని నియంత్రించడానికి ఐస్‌ కోసం క్యాబిన్‌ సిబ్బందిని అడిగి పెట్టాల్సి వచ్చిందని. 

కానీ ఆయనకు అయ్యిన తీవ్ర గాయాల రీత్యా ఎక్కువ మొత్తంలో ఐస్‌ప్యాక్‌లు అవసరమయ్యాయని అన్నారు. అప్పటికైన రక్తస్రావం కంట్రోల్‌ అయ్యిందేమోనని చూసిన ప్రతిసారి మరింత ఎక్కువ అయ్యేదని దాంతో మరింత ఐస్‌తో ఒత్తిడికలిగించక తప్పలేదన్నారు. అలా 45 నిమిషాల పాటు ఆ గాయాల నుంచి రక్తం కారకుండా నియంత్రించేందుకు ఐస్‌ముక్కలతో ఒత్తిడి కలిగించానని అన్నారు. అంతేగాదు ఆ సమయంలో ఆయనతో మాట్లాడించక తప్పలేదన్నారు. ఎందుకంటే ఆయన స్ప్రుహలోనే ఉండాలి కాబట్టి అలా చేయాల్సి వచ్చిందన్నారు. 

స్మిత్‌ దయచేసి నిద్రపోకండి..మీ కుటుంబం గురించి చెప్పండి, ఎంతమంది పిల్లలు అంటూ మాటల్లో పెట్టానన్నారు. తాను అలా అంటున్నప్పుడు ఆయన అన్నమాట తన మనసుని మెలిపెట్టిందన్నారు. సార్‌ నాకు సహాయం చేయండి, నాకు ఇక్కడ చనిపోవాలని లేదన్నారు. దాంతో తాను మీరు త్వరలో మీ కుటుంబాన్ని కలుస్తారని ధైర్యం చెబుతూ ఉన్నాను. అయితే ఆ టైంలో మచ్చార్‌ ప్రతిసారి తనకు తలలో విపరీతమైన నొప్పి వస్తుంది తట్టుకోలేకపోతున్నా అంటూ చెప్పేవాడన్నారు. 

ఒక పక్కడ అతడి పరిస్థితి క్షీణించిపోతుంది. ఒకానొక టైంలో నాడీ వేగం తగ్గిపోయి..పెదవులు నల్లగా మారిపోవడం గమనించానన్నారు. దాంతో అతడి కాళ్ల పైకి ఎత్తి ఉంచానన్నారు. దాంతో నాడి తిరిగి వచ్చిందని నాటి సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. మచ్చార్‌ నొప్పి నివారణ మందులు అడిగారు. కానీ తాను ఇవ్వలేదని, ఎందుకంటే మరింత రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉందని ఇవ్వలేదని చెప్పారు. అంతేగాదు అతడు వెల్లికిలా పడుకుని ఉన్నాడు..అతడిని ఏ మాత్రం కదిపినా..మందులు ఇచ్చినా చాలా ప్రమాదమని చెప్పుకొచ్చారు. 

అందుకే విమానం ల్యాండ్‌ అయ్యి..అతడికి వైద్య సహాయం అందే వరకు దాదాపు 45 నిమిషాల పాటు ఏదో ఒకటి మాట్లాడుతూ ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేశానన్నారు దంత వైద్యుడు ముసయేవ్. ఇదిలా ఉండగా మిగతా ప్రయాణికులు కోపైలట్‌ని అదుపులోకి తీసుకుని తాళ్లతో గట్టిగా కట్టేశారు. మిగతా ఇద్దరు స్టాండ్‌బై పైలట్లు ఒక ప్రయాణికుడితో కలిసి విమానాన్ని స్థిరంగా ల్యాండ్‌ చేయడానికి కాక్‌పీట్‌లో వెళ్లారు.

 ఆ తర్వాత విమానం సురక్షితంగా సౌదీ అరేబియాలోని తబుక్‌కి మళ్లించి మచ్చార్‌ను వైద్య బృందాలకు అప్పగించారు. తదుపరి చికిత్స కోసం మచ్చార్‌ని యూఏఈకి తరలించారు. ప్రస్తుతం కెప్టెన్‌ మచ్చార్‌ ప్రాణాలతో బయటపడ్డాడని తెలుసుకుని ముసయేవ్‌ సంతోషం వ్యక్తం చేయడమే గాక నీలాంటి మంచివాడికి అంతా మంచి జరిగుతుంది మిత్రమా..! అంటూ ఆశీర్వదించారు.

ఇదీ చదవండి: Success Sotry: రైతుగా సివిల్‌ ఇంజనీర్‌..! అరటపండ్లతో ఏకంగా రూ. 35 లక్షలు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement