రైతుగా మారి ఎందరో ఔత్సాహిక ఇంజనీర్లు లక్షల్లో ఆదాయం ఆర్జించడమే గాక రైతన్నలకు మార్గదర్శకులుగా మారారు. అంతేగాదు కష్టించే పనిచేసే వ్యవసాయంతో ఎలాంటి టెన్షన్‌లు, ఒత్తిడిలు లేని శారీరక శ్రమతో ఆరోగ్యానికి ఆరోగ్యం, సంపదకు సంపద పొందొచ్చని నిరూపిస్తున్నారు. తాజాగా ఆ కోవలోకి మరో సివిల్ ఇంజనీర్ చేరాడు.
అతడే మహారాష్ట్రకు చెందిన అభిజిత్ పాటిల్. పూణెలోని డీవై పాటిల్ కళాశాల నుంచి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి 2015లో వ్యవసాయరంగంలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. తన సహా విద్యార్థులంతా సంప్రదాయ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఎంచుకోగా, వ్యవసాయం చేసేందుకు మొగ్గు చూపాడు. అలా డిసెంబెర్ 2020లో పాటిలో ఆ భూమిలో ఎర్ర అరటిపండ్లను పండించడం ప్రారంభించాడు. సాధారణ పసుపు అరటిపండ్ల మల్లే కావివి. వీటికి మార్కెట్లో మంచి ధర తోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
పంట పండించడమే కాదు ఆ పంటను కొనుగోలు చేసే వ్యక్తులను సంపాదించడం అంతే ముఖ్యమే. ఆ విధంగా పాటిల్ తాను పండించిన ఎర్రటి అరటి పండ్లను పూణే, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లోని రిలయన్స్ టాటా అవుట్‌లెట్‌లతో సహా ప్రధాన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా అమ్ముడయ్యాయి. మొత్తం నాలుగు ఎకరాల తోటలో సుమారు 60 టన్నుల ఎర్రటి పండ్లు పండాయి. ఖర్చుల పోను తన వ్యాపారంతో సుమారు రూ. 35 లక్షల మేర సంపాదించాడు.
నాణ్యత, మార్కెట్ పరిస్థితుల రీత్యా ఈ ఎర్రటిపండ్లను కిలోకు సుమారు రూ. 60 నుంచి రూ. 90ల వరకు ధర పలుకుతాయట. అయితే ఈ ఎర్రటి అరటిపండ్లు సారవంతమైన ఒండ్రు మట్టిలోనే బాగా పెరుగాతాయని చెబుతున్నారు. నేలకు మంచి నీటి పారుదల, మొక్కలకు అవసరమయ్యేంత తేమ తప్పనిసరి. సేంద్రియ పదార్థాలు, నత్రజని, భాస్వరం, పొటాషియం సమృద్ధిగా ఉండే నేల ఈ ఎర్రటి అరటి పండ్లకు అనువైనది.
ఆరోగ్య ప్రయోజనాలు..
వి సాధారణ అరటిపండ్ల కంటే కొంచెం తీపిగా, అత్యంత క్రీమ్‌గా ఉండి మంచి ఆకృతిని కలిగి ఉంటాయి.
వీటిలో ఫైబర్, పొటాషియం, విటమిన్ సీ, విటమిన్ బీ6, యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే సహజ మొక్కల సమ్మేళనాలతో సహా శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి.
ఇవి జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి మంచివి.
తక్షణ శక్తిని అందించడం తోపాటు రోగనిరోధక శక్తికి తోడ్పడతాయి.
ఎలా తినాలి..
స్నాక్స్‌గా లేదా ఓట్స్ లేదా సెరియల్‌లో కలుపుకుని తినొచ్చు. పెరుగుతోనే లేక స్మూతీ తయారు చేసుకుని తినొచ్చు. ఫ్రూట్ చాట్, పాన్‌కేక్, మఫిన్, బనానా బ్రెడ్‌లగా కూడా తయారు చేసుకుని ఆస్వాదించొచ్చు. అంతేగాదు గడ్డకట్టిన ఎర్ర అరటిపండలను బ్లెండ్ చేసి ఒక సింపుల్ డెజర్ట్ తయారు చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: పది నెలల్లో 45 కిలోలు..! వైరల్‌గా ఆమె డైట్ ప్లాన్..


