ఏఐతో ఉద్యోగాలకు చెక్‌?.. ఇక వ్యవసాయమే దిక్కా? | Real Jobs Left In 5 to 10 Years Software Engineer Considers Farming Amid AI Fears | Sakshi
Sakshi News home page

ఏఐతో ఉద్యోగాలకు చెక్‌?.. ఇక వ్యవసాయమే దిక్కా?

Oct 26 2026 5:29 PM | Updated on Oct 26 2026 5:43 PM

Real Jobs Left In 5 to 10 Years Software Engineer Considers Farming Amid AI Fears

ఏఐ (AI) రాకతో.. టెక్నాలజీ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ తయారు చేయాలంటే.. ఇంజినీర్లు గంటల తరబడి కష్టపడాల్సి వచ్చేది. కానీ.. ఇప్పుడు ఏఐ సాయంతో కోడింగ్ చేయడం, వెబ్‌సైట్లు రూపొందించడం, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయడం వంటి పనులు చాలా సులభంగా జరిగిపోతున్నాయి. దీంతో టెక్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది?, అనే ఆందోళన మొదలైంది.

తాజాగా దాదాపు పదేళ్ల అనుభవం ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు రెడిట్‌లో వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.

భవిష్యత్తు ఎలా ఉంటుందో?
ఏఐ అభివృద్ధి వేగాన్ని అందుకోవడం చాలా కష్టంగా మారుతోందని వెల్లడించారు. రాబోయే ఐదు నుంచి పదేళ్లలో సంప్రదాయ ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని తెలిపాడు. గతంలో ఏఐ కోడింగ్ రాయగలిగినా, క్లిష్టమైన సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను రూపొందించడానికి అనుభవజ్ఞులైన ఇంజినీర్లు తప్పనిసరిగా అవసరమని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఏఐ ఆ పనులను కూడా చేయగలుగుతోందని, కొన్ని సందర్భాల్లో మనుషుల కంటే మెరుగైన ఫలితాలు ఇస్తోందని పేర్కొన్నాడు. దీంతో భవిష్యత్తులో తమ నైపుణ్యాలకు ఎంత విలువ ఉంటుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఉద్యోగం కంటే వ్యవసాయం మేలు!
ఇలాంటి పరిస్థితుల్లో.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని నమ్ముకోవడం కంటే వ్యవసాయం చేయడం లేదా, సొంతంగా నా ఆహారాన్ని నేను పండించుకోవడం మంచిదేమోనని ఆ ఇంజినీర్ చెబుతున్నారు.

ఏఐ వల్ల ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయని ఇప్పుడే చెప్పలేకపోయినా, టెక్నాలజీ వేగంగా మారుతుండటంతో ఉద్యోగులలో భయం పెరుగుతోంది. ముఖ్యంగా కోడింగ్, వెబ్ డెవలప్‌మెంట్ వంటి పనులను ఏఐ సులభంగా చేయగలగడం వల్ల భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఎలాంటి అవకాశాలు ఉంటాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నెటిజన్ల రియాక్షన్
ఇంజినీర్ అభిప్రాయాలపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఏఐని చూసి భయపడకుండా.. దాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలని ఒకరు సూచించారు. మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మాత్రం తాను నాలుగేళ్ల క్రితమే ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం అక్కడ వందకు పైగా కోళ్లు, గొర్రెలు, తేనెటీగల పెంపకంతో పాటు పండ్ల తోటను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పాడు.

వ్యవసాయం చేయడం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కంటే కష్టమైనప్పటికీ, అది ఎంతో సంతృప్తిని ఇస్తోందని తన అనుభవాన్ని పంచుకున్నాడు. మరికొందరు కూడా వ్యవసాయం వైపు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు కామెంట్లు చేశారు. ఎందుకంటే ఏఐ ఎంత అభివృద్ధి చెందినా, మనుషులకు ఆహారం అవసరం ఎప్పటికీ ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో మార్పు: ఇప్పుడు ఏది కొనాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement