బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఈ రోజు (సోమవారం) గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. దీనికి కారణం.. ''చమురు ధరలు తగ్గడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై పెట్టుబడిదారులు ఎదురుచూడటం'' వంటివని తెలుస్తోంది. అంతకుముందు వారంలో బంగారం ధరలు 4 శాతం తగ్గాయి. వడ్డీ రేట్లు, డాలర్ విలువ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు కూడా బంగారం ధరలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.
ధరలు ఎప్పుడూ పెరుగుతాయని చెప్పలేం
సాధారణంగా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి వంటి పరిస్థితుల్లో చాలామంది తమ డబ్బును రక్షించుకోవడానికి విలువైన లోహాల్లోనే పెట్టుబడిగా పెడతారు. అయితే బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతాయని ఖచ్చితంగా చెప్పలేం. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బంగారంపై పెట్టుబడుల తగ్గి, ధరలు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది.
వెండి విషయంలో మాత్రం కొంత భిన్నంగా ఆలోచించాలి. బంగారం ప్రధానంగా పెట్టుబడి, సంపద రక్షణ కోసం ఉపయోగపడితే.. వెండికి పారిశ్రామిక రంగంలో కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, సౌర విద్యుత్ పరికరాల తయారీలో వెండిని ఉపయోగిస్తారు. అందువల్ల వెండి ధరలు.. ఆర్థిక పరిస్థితులు, పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడిదారుల డిమాండ్‌ను బట్టి వేగంగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. కాబట్టి వెండిలో పెట్టుబడి పెట్టేటప్పుడు ధరలలో జరిగే మార్పులను జాగ్రత్తగా గమనించాలి.
తొందరపాటు పనికిరాదు
గ్రోవ్ నివేదిక ప్రకారం.. బంగారాన్ని తక్షణ లాభాల కోసం కాకుండా, భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితుల నుంచి రక్షణ పొందడానికి ఉపయోగించాలి. వెండి విషయంలో మాత్రం ధరలు స్థిరపడుతున్నాయా?, పెద్ద పెట్టుబడిదారులు మళ్లీ కొనుగోళ్లు చేస్తున్నారా?, గోల్డ్-సిల్వర్ రేషియో అనుకూల స్థాయికి చేరుతోందా? అనే అంశాలను పరిశీలించాలి. అయితే పెట్టుబడి పెట్టే ముందు తప్పకుండా జాగ్రత్త వహించాలి. ఏ మాత్రం తొందరపాటు పనికిరాదు.
ఇదీ చదవండి: నిఖిల్ కామత్ హెచ్చరిక.. దిగ్గజ కంపెనీలకు కొత్త సవాల్!
ఈ రోజు బంగారం వెండి ధరలు ఇలా
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన.. బంగారం ధరలు బ్రేక్ పడింది. గోల్డ్ రేటు మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేస్తోంది. నేడు (సోమవారం) పసిడి రేటు గరిష్టంగా రూ.170 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో.. ఈ కింద చూడవచ్చు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


