శ్రీశైలం: వరుస సెలవులు రావడంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీశైలం వెళ్లే రహదారులు రద్దీగా మారాయి. భారీ సంఖ్యలో వాహనాల రాకతో శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం నాడు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సుమారు 8 కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సాక్షి గణపతి నుంచి సున్నిపెంట వరకు వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆటోను ఢీకొన్న కారు... ఆటో డ్రైవర్ మృతి
జూపాడుబంగ్లా (నంద్యాల జిల్లా): నేషనల్ హైవే 340సీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మండ్లెం వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొనటంతో ఆటో డ్రైవర్ సామేలు(45) మృతిచెందిన సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకొంది. పోలీసుల వివరాల మేరకు... పారుమంచాల గ్రామానికి చెందిన సామేలు ఉదయం ఆటోలో నందికొట్కూరుకు బయలుదేరాడు. మార్గమధ్యలో మండ్లెం గ్రామం నుంచి తర్తూరు అంచెవద్ద హైవే 340సీ రోడ్డును క్రాస్ చేస్తుండగా కర్నూలు వైపు నుంచి వేగంగా వచ్చిన కర్ణాటకకు చెందిన కేఏ 30ఎం 8878 నెంబర్‌గల కారు ఢీకొంది.
చదవండి: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
ప్రమాదంలో ఆటో, కారు ముందు భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఆటో డ్రైవర్ సామేలు కిందపడటంతో అతని తనలకు బలమైన రక్తగాయాలయ్యాయి. అతన్ని చికిత్సనిమిత్తం 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స ప్రారంభించేలోగా అతను మృతిచెందినట్లు తెలిపారు. కారు ముందుభాగం నుజ్జు నుజ్జై రోడ్డుకిందికి దిగిపోయింది. అదృష్టవశాత్తు కారు డ్రైవర్‌తో పాటు అందులోని వారికి ఎలాంటి గాయాల్లేకుండా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించుకొన్నారు. మృతుని భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
శ్రీశైల మహాక్షేత్రంలో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి గణపతి నుంచి సున్నిపెంట వరకు సుమారు 8 కి.మీ. మేర నిలిచిన వాహనాలు
వరుస సెలవులతో శ్రీశైలానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ
భక్తుల వాహనాలతో రోడ్లపై భారీగా ట్రాఫిక్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు#Srisailam #TrafficJam… pic.twitter.com/omjVYAEj45— Anjaneyulu (@Anjaneyulu_01) August 15, 2026


