టాలీవుడ్ హీరో శ్రీకాంత్ దంపతులు శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా స్వామి అమ్మవార్లను తన భార్య, నటి ఊహతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైలం వెళ్లిన శ్రీకాంత్ దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద అధికారులు స్వాగతం పలికారు.
అనంతరం మల్లిఖార్జున, భ్రమరాంబ అమ్మవార్లను హీరో శ్రీకాంత్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు వీరికి వేద ఆశీర్వచనాలు అందించారు. దీనికి సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే శ్రీకాంత్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తోన్న సంబరాల ఏటిగట్టు చిత్రంలో నటిస్తున్నారు. ఇవాళ శ్రీకాంత్ బర్త్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు.
Birthday boy #Srikanth in a brand new avatar as BRITISHUUU from #SambaralaYetiGattu 🎉🔥
Stylish, fresh & intriguing look—setting the vibe already! 👀✨#SYG #SaiDharamTej #Tollywood #NewLook #BirthdaySpecial @actorsrikanth pic.twitter.com/ePycsIAR6A— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) March 23, 2026


