తాత్కాలికంగా ఇష్టకామేశ్వరి ఆలయం సందర్శన నిలిపివేత | Srisailam Istakameswari Temple Darshan Halted | Sakshi
Sakshi News home page

తాత్కాలికంగా ఇష్టకామేశ్వరి ఆలయం సందర్శన నిలిపివేత

May 2 2026 2:13 PM | Updated on May 2 2026 2:32 PM

Srisailam Istakameswari Temple Darshan Halted

సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి ఆలయం సందర్శన తాత్కాలికంగా నిలిపివేశారు. అటవీశాఖ-చెంచు డ్రైవర్ల మధ్య వివాదం చెలరేగింది. ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తిని ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లడానికి ఈడీసీ అధికారులు అనుమతించారు. నిబంధనలకు విరుద్దంగా ఎలా అనుమతిస్తారంటూ చెంచు డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వివాదం మొదలైంది.

వివాదం ముదరడంతో ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లే భక్తుల టికెట్ల రుసుమును  అటవీశాఖ సిబ్బంది వెనక్కి ఇచ్చేశారు. వివాదం సద్దుమణిగిన తర్వాతనే యాత్ర పున:ప్రారంభిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆలయం తాత్కాలికంగా మూసివేయడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement