తిరుపతి: ప్రభుత్వ టీచర్ల భవిష్యత్‌తో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుకుంటోందని, వారి జీవితాలతో ఆటలాడటం సరైంది కాదని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు. టీచర్లను నమ్మించి ఓట్ల దండుకున్న చంద్రబాబు.. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు.
‘ఉపాధ్యాయులు మనోభావాలు దెబ్బతీస్తోంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు వైఖరిపై ప్రభుత్వ టీచర్లు చేసే పోరాటానికి వైఎస్సార్‌సీపీ మద్దతు ఉంటుంది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోరడం తప్పా?, వంచించడమే జీవిత ఆశయంగా పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు సర్కారు మెడలు వంచి టీచర్లు పక్షాన వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. చంద్రబాబు అరాచక పాలన పై పోరాటం సాగిస్తాం’ అని భూమన స్పష్టం చేశారు.


