అలా అయితేనే బీసీలకు న్యాయం జ‌రుగుతుంది | Congress Leader Hanumantha rao Latest Comments on Caste Census | Sakshi
Sakshi News home page

బీసీలంతా ఏకం కావాలి: హ‌నుమంత‌రావు

Aug 15 2026 3:38 PM | Updated on Aug 15 2026 3:46 PM

Congress Leader Hanumantha rao Latest Comments on Caste Census

కామారెడ్డి : జ‌నాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, తెలంగాణ‌ ప్రభుత్వ సలహాదారుడు వి. హనుమంతరావు అన్నారు. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ‌నివారం ఆయ‌న విలేకరుల సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. బీసీల కోసం త‌మ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ రాజీలేని పోరాటం చేస్తున్నార‌ని చెప్పారు. న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం బీసీలను ఓట్ల యంత్రాలుగా వాడుకుంటోంద‌ని, వారి అభివృద్ధి కోసం ఏమీ చేయ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

బీసీల పేరు ఎందుకు లేదు?
జనగణనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయంగా జరుగుతోంద‌ని హ‌నుమంత‌రావు ఆరోపించారు. కుల గణన‌లో బీసీల పేరు ఎందుకు లేదని ప్ర‌శ్నించారు. జనాభా ప్రకారం బీసీలకు న్యాయం చేయాలని, పార్లమెంట్‌లో బీసీలకు ప్రత్యేక బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ''జనగణనతో పాటు కుల గణన జరపాలి. స్వతంత్ర పోరాటం లెక్క బీసీ కులగణన కోసం పోరాటం చేయాలి. కులగణనతోనే బీసీల అభివృద్ధి సాధ్యం. తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉంది. అన్ని కులాల వారు ఒక్కటి కావలె.. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంద''ని హ‌నుమంత‌రావు వ్యాఖ్యానించారు.

అంబేద్కర్ అడుగు జాడల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుతోంద‌ని చెప్పుకొచ్చారు వీహెచ్‌. బీసీలకు అన్యాయం జరుగుతోంద‌ని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారని, పార్ల‌మెంట్‌లోనూ బీసీల కోసం కొట్లాడుతున్నార‌ని అన్నారు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేశారని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల గురించి ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ మాట్లాడడం లేదని ధ్వ‌జ‌మెత్తారు. కింది స్థాయి కులాల గురించి ప్ర‌భుత్వం ఆలోచించాలని సూచించారు.

హుషారుగా వీహెచ్ డాన్స్‌
కామారెడ్డిలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన‌ స్వాతంత్య్ర దినోత్స వేడుకల్లో డాన్స్ చేసి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు హ‌నుమంత‌రావు. గిరిజ‌న వేషాధార‌ణ‌లో ఉన్న విద్యార్థినుల‌తో క‌లిసి ఆయ‌న హుషారుగా స్టెప్పులేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ఆయ‌న‌తో పాటు డాన్స్ చేశారు. వీహెచ్ డాన్స్ వీడియో.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

చ‌ద‌వండి: నిరుద్యోగుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement