హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సిటీ సెంటర్ బ్రాంచ్‌కు ర.3.23 కోట్ల నష్టం కలిగించిన ఘటనలో ’క్వాలిటీ ప్లాజా ఆటో కార్స్’ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు ప్రవెటర్లు నడిపల్లి సాయి తరుణ్, నడిపల్లి భాస్కర్‌రావులపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.బ్రాంచ్ మేనేజర్ కె.సంజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఈ దర్యాప్తు ప్రారంభమైంది. రెనాల్ట్ కార్ల డీలర్ అయిన ఈ సంస్థ 2017లో ఎస్‌బీఐ నుంచి వివిధ రుణాలు పొందింది.
అయితే రుణాలు సక్రమంగా చెల్లించకపోవడంతో 2020 ఫిబ్రవరిలో ఈ ఖాతాలు ఎన్‌పీఏగా మారాయి. బ్యాంకు అనుమతి లేకుండానే హైపోథికేషన్ చేసిన ర.4.93 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడమే కాకుండా, ఆ మొత్తాన్ని రుణ ఖాతాలో జమ చేయలేదని ఆరోపణలు వచ్చాయి. నిజావబాద్‌లోని షోరమ్‌ను తనిఖీ చేయగా యూనిట్ మూతపడినట్లు గుర్తించి, మొత్తం ర.3.23 కోట్ల మేర బ్యాంకుకు నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.


