ఇస్రో రాజీనామాలను లైట్‌ తీసుకున్న కేంద్ర మంత్రి : సంచలన వ్యాఖ్యలు | Many Come And Go: Science Minister Downplays ISRO Resignations | Sakshi
Sakshi News home page

ఇస్రో రాజీనామాలను లైట్‌ తీసుకున్న కేంద్ర మంత్రి : సంచలన వ్యాఖ్యలు

Jul 16 2026 5:51 PM | Updated on Jul 16 2026 6:20 PM

Many Come And Go: Science Minister Downplays ISRO Resignations

సాక్షి,న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం (KKNPP) ఈ రెండు కీలక పరిణామాలపై  కేంద్ర సైన్స్ అండ్ టెక్నికల్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) జితేంద్ర సింగ్కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్రోలో శాస్త్రవేత్తల రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణలపై నియంత్రణలు విధిస్తూ జారీ చేసిన మెమోపై ఆయన స్పందించారు.

గగన్‌యాన్ వంటి ప్రతిష్టాత్మక మిషన్లలో పనిచేస్తున్న గ్రూప్ 'A' సైంటిఫిక్, టెక్నికల్ సిబ్బంది రాజీనామాలను లేదా స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) దరఖాస్తులను అంత తేలికగా ఆమోదించవద్దని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC), విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) వంటి విభాగాలకు అంతరిక్ష శాఖ జూలై 14న ఆదేశాలు జారీ చేసింది.

ఇస్రో సైంటిస్టుల రాజీనామాలు, ఆంక్షలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు  రేపుతున్న తరుణంలో కేంద్ర మంత్రి వీరి రాజీనామాలను లైట్‌ తీసుకున్నారు. ఇస్రోలో భారీ సంఖ్యలో సిబ్బంది పనిచేస్తున్నారని, "చాలా మంది వెళ్తుంటారు,  పోతుంటారు  అని చెప్తూ ఇందులో ఎలాంటి వివాదం లేదని కొట్టిపారేశారు. ప్రభుత్వం నిర్ణయం వెనుక కేవలం పరిపాలనా పరమైన కారణాలు మాత్రమే ఉన్నాయని, ఉన్నత స్థాయిలో మరింత పరిణతితో నిర్ణయాలు తీసుకోవడానికే ఈ మెమో జారీ చేశామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ట్రంప్‌ను అంతం చేస్తాం : శవపేటికతో ఇరాన్‌ హోర్డింగ్‌ కలకలం

భారతదేశ భవిష్యత్తు అంతరిక్ష మిషన్ల గురించిన ప్రశ్నకు సమాధానంగా  దాదాపు 10 ఏళ్ల క్రితం మాజీ ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్‌ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గుర్తు చేశారు. మనిషిని అంతరిక్షంలోకి పంపడం సులభమని, కానీ వారిని తిరిగి తీసుకు రావడం అంతే కష్టమని ఆయన అన్నారు. ఆ విధంగానే 'క్రూ మాడ్యూల్' ఆలోచన మొదలైంది. సోమనాథ్ ఇప్పుడు ఇస్రో అధికారిక బాధ్యతల్లో లేనంత మాత్రాన గగన్‌యాన్ మిషన్ ఆగిపోదన్నారు. ఇస్రోలో ప్రాజెక్టులు నిరంతరాయంగా సాగుతాయని, రిటైర్ అయిన శాస్త్రవేత్తలు కూడా వీటిలో భాగస్వాములుగా ఉంటారని సింగ్ చెప్పారు.

KKNPPపై స్పందిస్తూ..
అలాగే KKNPP గురించి జరుగుతున్న ప్రచారం లేదా ఆందోళనకు ఆ వ్యూహాత్మక కేంద్రంతో వాస్తవానికి ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన సూచించారు. అసలు ఏమీ జరగనప్పుడు సమీక్ష అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు.అణు విద్యుత్ కేంద్రం విషయంలో, NPCIL, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) దర్యాప్తు చేస్తున్నాయి. కూడంకుళంలో రష్యా రూపొందించిన రెండు 1,000 మెగావాట్ల రియాక్టర్లు పనిచేస్తుండగా, అదనంగా నాలుగు యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. పూర్తయిన తర్వాత, ఈ ప్రాజెక్ట్ మొత్తం 6,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో భారతదేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ పార్క్‌గా అవతరిస్తుందని అంచనా.

దీ చదవండి: కీలక ఫెడ్ పదవులు : రఘురామ్ రాజన్‌, మరో ఇద్దరు భారతీయ నిపుణులు

కాగా గగన్‌యాన్‌, చంద్రయాన్ తదితర ప్రతిష్టాత్మక మిషన్లలో పనిచేస్తున్న 100 మందికి పైగా ఇస్రో  శాస్త్రవేత్తలు రాజీనామా చేయడం లేదా స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) కోరారు. అయితేప్రాజెక్ట్‌లు పూర్తయ్యే వరకు గగన్‌యాన్ వంటి జాతీయ ప్రాధాన్యత గల మిషన్లలోని సిబ్బంది రాజీనామాలను ఆమోదించవద్దని ఇస్రో కేంద్రాల డైరెక్టర్లకు కేంద్ర అంతరిక్ష శాఖ  కఠిన ఆంక్షలు విధించింది.  2020లో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ, ఇకపై ఏ శాస్త్రవేత్త రాజీనామా లేదా వీఆర్ఎస్ దరఖాస్తు వచ్చినా, దానిని నేరుగా అంతరిక్ష శాఖకు పంపాలని, తుది నిర్ణయం అక్కడే జరుగుతుందని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement