ఆంక్షలను ధిక్కరించిన ఉక్కు సంకల్పం | Nuclear Journey Strategic Decisions Historical Challenges Sakshi Editorial Special Story | Sakshi
Sakshi News home page

ఆంక్షలను ధిక్కరించిన ఉక్కు సంకల్పం

Jul 17 2026 1:47 PM | Updated on Jul 17 2026 1:51 PM

Nuclear Journey Strategic Decisions Historical Challenges Sakshi Editorial Special Story

సువేద్, కునాల్‌, అభిజిత్‌ చావ్డా

భారతదేశ అణు ప్రయాణం, దాని వెనుక ఉన్న వ్యూహాత్మక నిర్ణయాలు, చారిత్రక సవాళ్ల గురించి అభిజిత్‌ చావ్డా ఈ ఎపిసోడ్‌లో మాట్లాడారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌.పి.టి.) వెనుక ఉన్న వివక్ష, పోఖ్రాన్‌ పరీక్షల ద్వారా భారత్‌ సాధించిన విజయం వంటి అంశాలను ప్రస్తావించారు:

మొండితనం కాదు, మనుగడ నిర్ణయం
‘‘అగ్ర దేశాలు 1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఖరారు చేసినప్పుడు, వారు ఒక స్పష్టమైన గీత గీశారు. ‘మా దగ్గర 1967 కంటే ముందే అణ్వాయు ధాలు ఉన్నాయి కాబట్టి మేము వాటిని ఉంచుకుంటాం, కానీ మిగతా వాళ్లు ఎవరూ వాటిని తయారు చేసుకో కూడదు’ అని! నా దృష్టిలో ఇది ఆయుధాలను నియంత్రించే ఒప్పందం కాదు. కేవలం కొన్ని దేశాలకే ప్రాధాన్యం ఇచ్చే ఒక వివక్షతో కూడిన రాజకీయం. మన పొరుగు దేశాలు శత్రువులుగా మారుతున్న సమయంలో, ఇండియా తనను తాను రక్షించుకునే సార్వ భౌమ హక్కును వదులుకుంటూ ఈ ఒప్పందంపై సంతకం చేయాలని వారు ఆశించారు. ఇండియా ఎన్‌పీటీపై సంతకం చేయకపోవడం మొండితనం కాదు, అది మనుగడ కోసం తీసుకున్న స్పష్టమైన నిర్ణయం.

భాభా ‘మరణం’ వెనుక అమెరికా!
‘‘1966లో డాక్టర్‌ హోమీ భాభా మరణం చుట్టూ ఉన్న చీకటి కోణాలను, ఆయన అద్భుతమైన ఆలోచనలను అర్థం చేసుకోకుండా ఇండియా అణు ప్రయాణాన్ని మనం తెలుసుకోలేం. ఆ కాలపు చారిత్రక పరిణామా లను బట్టి చూస్తే, ఆల్ప్స్‌ పర్వతాలపై జరిగిన ఎయిర్‌ ఇండియా ఫ్లయిట్‌ 101 ప్రమాదంలో భాభా మరణించడం ఒక ప్రమాదం కాదని నేను గట్టిగా నమ్ముతాను. అది ఇండియా అణు సామర్థ్యాలను సాధించడానికి ఎంత దగ్గరగా ఉందో చూసి భయపడిన విదేశీ నిఘా సంస్థలు – ముఖ్యంగా సి.ఐ.ఎ. – పన్నిన ఒక కుట్ర. మనం 18 నెలల్లోనే అణు పరికరాన్ని తయారు చేయ గలమని భాభా బహిరంగంగానే ప్రకటించారు. ఆయనను నిర్మూలించడం ద్వారా, విదేశీ శక్తులు మన అణు పురోగతిని కొన్ని దశాబ్దాల వెనక్కి నెట్టాయి.

ఆచితూచిన పేరు ‘స్మైలింగ్‌ బుద్ధ’
‘‘మనం 1974లో పోఖ్రాన్‌–1 పరీక్షను నిర్వహించి నప్పుడు, దానికి ‘శాంతియుత అణు విస్ఫోటం’ (పి.ఎన్‌.ఇ.–పీస్‌ఫుల్‌ న్యూక్లియర్‌ ఎక్స్‌ప్లోషన్‌) అని పేరు పెట్టి, ‘స్మైలింగ్‌ బుద్ధ’ అనే రహస్య కోడ్‌ను ఉప యోగించాం. ఈ పేరు పెట్టడం ఆనాటి మన రాజకీయ నాయకత్వంలో ఉన్న తీవ్రమైన భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లను, లోతైన సంకోచాన్ని తెలియజేస్తుంది.

ముఖ్యంగా 1971 భారత్‌–పాక్‌ యుద్ధంలో పాక్‌కు అను కూలంగా భారత్‌పై ఒత్తిడి తేవటానికి అమెరికా తన ఏడవ నౌకాదళాన్ని (సెవెంత్‌ ఫ్లీట్‌) బంగాళాఖాతంలో మోహరించిన తర్వాత, మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించాలని అనుకున్నాం. కానీ మనం ఒక అణు దేశ మని బహిరంగంగా ప్రకటించుకునే ధైర్యాన్ని అప్పట్లో ప్రదర్శించలేకపోయాం. ఈ ‘వ్యూహాత్మక అస్పష్టత’ (ఎటూ తేల్చని విధానం) అనే పాలసీ వల్ల 24 ఏళ్లపాటు దౌత్యపరమైన సందిగ్ధతలోనే ఉండిపోయాం. ఆఖరికి 1998లో వాజ్‌పేయి నాయకత్వంలో జరిగిన పోఖ్రాన్‌ –2 పరీక్షలు మాత్రమే, ఇండియా ఒక అణు దేశం అనే నిజాన్ని ప్రపంచానికి స్పష్టం చేశాయి.

‘కల్పక్కం’ మన సత్తాను చాటింది!
‘‘కొరతగా ఉన్న యురేనియంకు బదులుగా, మన దేశంలో సమృద్ధిగా ఉన్న థోరియం నిల్వలపై ఆధార పడిన మన ‘మూడంచెల అణు విద్యుత్‌ కార్యక్రమం’ భారతీయ శాస్త్రవేత్తల స్వయం సమృద్ధికి ఒక గొప్ప నిద ర్శనం. 1974 అణు పరీక్షల తర్వాత పాశ్చాత్య దేశాలు మనపై కఠినమైన ఆంక్షలు విధించినప్పుడు, మన అణు రియాక్టర్లకు ఇంధనం అందకుండా చేసి, మనల్ని లొంగి పోయేలా చేయవచ్చని వారు భావించారు. కానీ వారి అహంకారం పూర్తిగా తిరగబడింది. కల్పక్కం వంటి కేంద్రాల్లోని మన శాస్త్రవేత్తలు ఒంటరిగానే కొత్త ఆవిష్క రణలు చేశారు. మరెవరూ ప్రాధాన్యం ఇవ్వని ‘ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్లు’, ‘థోరియం వినియోగ చక్రాల’పై  పట్టు సాధించారు. ప్రపంచ దేశాలు మనల్ని ఒంటరిని చేసినప్పటికీ, ఇండియా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే సాంకేతికతను తన సొంత శక్తితో ఎలా నిర్మించు కోగలదో నిరూపించిన గొప్ప విజయ చిహ్నం అది.
- ఎడిటోరియల్‌ టీమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement