breaking news
prorogue
-
మళ్లీ పార్లమెంట్ సమావేశాలు!
న్యూఢిల్లీ: ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి, కీలకమైన బిల్లును ఆమోదింపజేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేసిన పది రోజుల తర్వాత కూడా సమావేశాలు ఇంకా అధికారికంగా ముగియలేదు. సాధారణంగా సభను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత అధికారికంగా ముగిసినట్లు(ప్రోరోగ్) నాలుగైదు రోజుల్లోగా ప్రకటిస్తారు. కానీ, ఈసారి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆదివారం ఉదయం వరకు వర్షాకాల సమావేశాల ముగింపునకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ జారీ కాలేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 18న నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 20న ప్రోరోగ్ చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు, ప్రోరోగ్ చేస్తారు. 2029 పార్లమెంటరీ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని సవరించే బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ బిల్లును ఆమోదింపజేయడానికి బడ్జెట్ సమావేశాల సమయంలోనే ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో బిల్లు వీగిపోయింది. స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం కోరవచ్చన్న సంకేతాలు కనిపించాయి. వర్షాకాల సమావేశాలు ఇంకా అధికారికంగా ముగియని నేపథ్యంలో ఉభయ సభలను ప్రత్యేకంగా కొలువుదీర్చి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడతారన్న ప్రచారం సాగుతోంది.డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయడానికి కుట్రలు: జైరామ్ రమేశ్న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అధికారికంగా ముగించడంలో జరుగుతున్న జాప్యం వెనుక కారణం ఏమిటని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ నిలదీశారు. నియోజకవర్గాల పునరి్వభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రత్యేక సమావేశంలో ఆమోదింపజేసుకోవడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికీ మూడింట రెండొంతుల మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. లోక్‌సభ నిరవధిక వాయిదాకు, దాని అధికారిక ముగింపుకు మధ్య సాధారణంగా రెండు నుంచి నాలుగు రోజుల వ్యవధి ఉంటుందని గుర్తుచేశారు. అయితే వాయిదా, అధికారిక ముగింపు రెండూ ఒకే రోజున జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. గతంలో నిరవధిక వాయిదాకు, అధికారిక ముగింపుకు మధ్య చాలా వ్యవధి ఉన్నప్పటికీ అప్పటి పాలకులు ఎలాంటి కుట్రలు చేయలేదని పేర్కొన్నారు. ఈ మేరకు జైరామ్ రమేశ్ తాజాగా ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఈసారి లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేసి పది రోజులు గడిచినా, దాని అధికారిక ముగింపుపై ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. ఈ అసాధారణ జాప్యానికి కారణమేమిటి? అని అన్నారు. డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయడానికి అమిత్ షా కుట్రలు చేస్తున్నట్లు పరోక్షంగా అనుమానం వ్యక్తంచేశారు. లోక్‌సభ, రాజ్యసభ ఈనెల 13న నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. వర్షాకాల సమావేశాలు అధికారికంగా ముగిసినట్లు ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. సభను వాయిదా వేసే ప్రక్రియను తెలియజేయడానికి ఎం.ఎన్.కౌల్, ఎస్.ఎల్.షక్దర్ రచించిన ‘ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్’పుస్తకంలోని ఒక పేజీ స్క్రీన్‌షాట్‌ను జైరామ్ రమేశ్ షేర్ చేశారు. ఆర్టికల్ 85(2) కింద రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వు ద్వారా పార్లమెంట్ సమావేశాలను అధికారికంగా ముగించడాన్ని ప్రొరోగేషన్ అంటారు. సభను ప్రొరోగ్ చేసే అధికారాన్ని వినియోగించేటప్పుడు రాష్ట్రపతి.. ప్రధానమంత్రి సలహా మేరకు వ్యవహరిస్తారు. రాష్ట్రపతికి సలహా సమర్పించే ముందు ప్రధానమంత్రి తన మంత్రివర్గాన్ని సంప్రదించవచ్చు. లోక్‌సభలో ప్రస్తుత సీట్ల సంఖ్యను 25 ఏళ్లపాటు స్తంభింపజేయాలని, 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రోరోగ్
-
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రోరోగ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. శాసన సభ, శాసన మండలి సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రోరోగ్ ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేయడంతో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్ తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించినట్లు అయింది. కాగా బిల్లులు మండలి ముందున్న సమయంలో..సభలను ప్రోరోగ్ చేస్తే ఆర్డినెన్స్ జారీకి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. (ముఖం చెల్లక.. అసెంబ్లీకి రాలేక) ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదు.. తాడేపల్లి: శాసన మండలి రద్దును ఎవరూ అడ్డుకోలేరని మంత్రి విశ్వరూప్ స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదన్నారు. మండలి రద్దు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామని కేంద్ర బీజేపీ నేతలు చెప్పారన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు స్టేజ్ షో కోసం ఢిల్లీ వెళుతున్నారని విశ్వరూప్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు స్టేజ్ షోలు బాగా అలవాటు అని, సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తేవడం సరికాదన్నారు. (ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు) చదవండి: ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు -
అసెంబ్లీని "ప్రోరోగ్" చేసిన గవర్నర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాలను రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ "ప్రోరోగ్" చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉభయ సభల 6వ సెషన్ సమావేశాలు గతేడాది డిసెంబర్ 16వ తేదీన ప్రారంభమయ్యాయి. కాగా, సమావేశాలు 18 రోజులపాటు కొనసాగి ఈ నెల 18న ముగిశాయి. అయితే, 27వ తేదీ నుంచే సమావేశాలు ప్రోరోగ్ అయ్యాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అసెంబ్లీని ప్రొరోగ్ చేయొద్దు.. గవర్నర్‌కు టి.మంత్రుల వినతి
తెలంగాణ బిల్లు త్వరలో శాసనసభకు రానున్న సమయంలో అసెంబ్లీని నిరవధికంగా వాయిదా(ప్రొరోగ్) వేయవద్దని ఆ ప్రాంత మంత్రులు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయించాలన్న ప్రయత్నాల్ని ఆమోదించరాదని విన్న వించారు. మంగళవారం మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, బస్వరాజ్ సారయ్య గవర్నర్‌తో భేటీఅయ్యూరు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపతి నుంచి టీ-బిల్లు రాగానే అసెంబ్లీని సమావేశపర్చాలని గవర్నర్‌ను కోరామన్నారు. అసెంబ్లీ అభిప్రాయ సేకరణను వెంటనే పూర్తిచేయించి బిల్లు రాష్ట్రపతికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. -
ప్రొరోగ్ వివాదానికి తెర
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, శాసనమండలి ప్రొరోగ్ వివాదం ముగిసింది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ సంబంధిత పత్రాలను శనివారం ప్రభుత్వానికి పంపారు. మండలిని కూడా ప్రొరోగ్ చేస్తూ చైర్మన్ చక్రపాణి కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రొరోగ్ అంశం సీఎం-స్పీకర్ వివాదంగా మారి తీవ్ర చర్చకు దారి తీయడం తెలిసిందే. చివరికి కాంగ్రెస్ అధిష్టానం జోక్యంతో ఈ వివాదంపై సీఎం కార్యాలయ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఆర్డినెన్సుల జారీకి అడ్డంగా ఉందనే కారణంతోనే అసెంబ్లీని పొరోగ్ చేయాలంటూ లేఖ రాసినట్టు వివరించాయి. వివాదం సద్దుమణగడంతో ప్రొరోగ్ లేఖలను చైర్మన్, స్పీకర్ శనివారం ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. అయితే స్పీకర్ పంపిన ప్రొరోగ్ లేఖ శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ద్వారా సీఎంఓకు, అక్కడి నుంచి గవర్నర్‌కు చేరాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రొరోగ్తో అనుమానాలు: శ్రీధర్‌బాబు శాసనసభ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున సభను ప్రొరోగ్ చేయడం వల్ల అనేక సందేహాలు నెలకొనే అవకాశాలున్నాయని పౌరసరఫరాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. దీన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. స్పీకర్ సీమాంధ్రకు చెందిన వ్యక్తి కావడం వల్ల అపోహలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయవద్దని గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు. సబ్సిడీ గ్యాస్‌కు ఆధార్‌ను అనుసంధానించే విషయంలో కోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ విషయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. ఆధార్ పొందటం వల్ల అన్ని విధాలా ప్రయోజనమని ఆయన అభిప్రాయపడ్డారు. -
సీఎం కిరణ్ ఎత్తుగడ వికటించిందా?


