పాకిస్తాన్ వెబ్ సిరీస్‌పై వివాదం.. ఇండియాలో స్ట్రీమింగ్ అవుతుందా?
పాకిస్తాన్ రూపొందించిన మొట్టమొదటి ఒరిజినల్ వెబ్‌సిరీస్ వివాదాల్లో చిక్కుకుంది. ఫవాద్‌ఖాన్, మాహీరా ఖాన్, సనమ్ సయీద్‌లు నటించిన ‘జో బచే హై సంగ్ సమేట్ లో’ను భారత్‌లో నిషేధించాలని కోరుతూ రెండు సినీ కార్మిక సంఘాలు ప్రధాని నరేంద్రమోదీకి లేఖలు రాశాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, ఓటీటీ వేదికలపై పాకిస్తానీ కంటెంట్‌ను నిలిపి వేయాలంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మార్గదర్శకాలు జారీ చేసిన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు హారర్ సిరీస్.. ఆ రాత్రి ఏం జరిగింది?వెబ్ సిరీస్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తోందని, దేశంలో విడుదల చేయరాదని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్‌లు లేఖలో డిమాండ్ చేశాయి. ప్రముఖ ఉర్దూ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ట్రైలర్ మంగళవారం విడుదలైంది. డిసెంబర్ 4న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ భారత్‌లో విడుదలవుతుందా లేదా అన్న దానిపై నెట్‌ఫ్లిక్స్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.