నౌక కోసం అన్వేషిస్తుండగా.. ఊహించని దృశ్యం.. | Mysterious Shipwreck Find Graveyard Of Washing Machines Refrigerators | Sakshi
Sakshi News home page

నౌక కోసం అన్వేషిస్తుండగా.. ఊహించని దృశ్యం..

Nov 28 2026 9:24 AM | Updated on Nov 28 2026 10:40 AM

Mysterious Shipwreck Find Graveyard Of Washing Machines Refrigerators

అమెరికా శాస్త్రవేత్తలు గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో సముద్ర గర్భంలో మునిగిపోయిన ఓ నౌక కోసం అన్వేషిస్తుండగా.. వారికి ఊహించని దృశ్యం కనిపించింది. సముద్రపు అడుగున సుమారు 1.5 కిలోమీటర్ల లోతులో పెద్ద సంఖ్యలో ఫ్రిజ్‌లు, ఫ్రీజర్లు, వాషింగ్‌ మెషీన్లు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. సముద్రంలో గల్లంతైన ఓ షిప్పింగ్‌ కంటైనర్‌లోని సరుకుగా గుర్తించారు. అమెరికా నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ 2017లో ఓకీనోస్‌ ఎక్స్‌ప్లోరర్‌ నౌకలో చేపట్టిన పరిశోధన సందర్భంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మెరైన్‌ బయాలజిస్ట్‌ దివా అమోన్‌, ఎకైనోడెర్మాలజిస్ట్‌ చార్లెస్‌ మెస్సింగ్‌ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ ప్రాంతానికి ‘డీప్‌ క్లీన్‌’ అని పేరు పెట్టింది. సైన్స్‌ అలర్ట్‌ కథనం ప్రకారం.. బృందంలోని సభ్యులు సోనార్‌ పరికరం ద్వారా సముద్ర గర్భంలో ఓ పెద్ద నిర్మాణం, దాని చుట్టూ చిన్న చిన్న వస్తువులను గుర్తించారు. దీంతో అక్కడ మునిగిపోయిన ఓడ అవశేషాలు ఉండవచ్చని భావించారు.

అయితే, అమోన్‌ బృందం రిమోట్‌ ఆపరేటెడ్‌ వెహికల్‌ను సముద్రంలోకి పంపించగా.. అక్కడ తెల్లటి రంగులో ఉన్న గృహోపకరణాలు కనిపించాయి. వాటిలో కొన్ని పగిలిపోగా.. దెబ్బతిన్న ఎరుపు రంగు షిప్పింగ్‌ కంటైనర్‌ కూడా కనిపించింది. దాని పక్క నుంచి మరిన్ని వస్తువులు బయటపడి ఉన్నాయి. వాటికి ప్యాకింగ్‌ లేకపోవడంతో రీసైక్లింగ్‌ కోసం తరలిస్తున్న సరుకుగా పరిశోధకులు భావించారు. ఒక గృహోపకరణంపై ఉన్న స్టిక్కర్‌ ఆధారంగా అది అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లూయిస్‌విల్లేలో ఉన్న జనరల్‌ ఎలక్ట్రిక్‌ అప్లయెన్స్‌ పార్క్‌ నుంచి వచ్చినట్లు గుర్తించారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల సమయంలో ఓ నౌక నుంచి ఈ కంటైనర్‌ సముద్రంలో పడిపోయి ఉండవచ్చని పరిశోధక బృందం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 28 కోట్ల కంటైనర్లను రవాణా చేస్తుండగా.. వాటిలో కొన్ని వందల నుంచి వెయ్యికి పైగా కంటైనర్లు సముద్రంలో గల్లంతవుతున్నాయని వరల్డ్‌ షిప్పింగ్‌ కౌన్సిల్‌ గణాంకాలు  చెబుతున్నాయి.

ఇదీ చదవండి: షేక్‌ హసీనా సంచలన ప్లాన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement