నలుగురి అరెస్టు, రూ.లక్ష విలువైన నాణేల స్వా«దీనం
న్యూఢిల్లీ: నకిలీ రూ.20 నాణేల తయారీ, సరఫరా చేస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. సూత్రధారి సహా నలుగురిని అరెస్టు చేశారు. సుమారు లక్ష రూపాయల విలువైన నకిలీ రూ.20 నాణేలను స్వా«దీనం చేసుకున్నారురు. ముండ్కా ఇండ్రస్టియల్ ఏరియా మెట్రో స్టేషన్ సమీపంలో నాణేల పంపిణీ సమాచారం మేరకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. ఒక కారును అడ్డగించిన పోలీసులు వెనుక సీటులోని బ్యాగ్‌లో 50 పాలిథీన్ సంచుల్లో ప్యాక్ చేసిన రూ.5,000 విలువైన నకిలీ రూ.20 నాణేలను స్వా«దీనం చేసుకున్నారు.
వాహనం నడుపుతున్న పారస్ జైన్‌ను అరెస్టు చేశారు. సోనిపట్‌లో తయారీ యూనిట్ నిర్వహిస్తున్న ఉప్‌కార్ లూథ్రా అలియాస్ అభయ్ ప్రతాప్ సింగ్ నుంచి రూ.లక్ష విలువైన నాణేలను రూ.70వేలకు కొనుగోలు చేసినట్లు జైన్ వెల్లడించారు. విచారణ అనంతరం, లూథ్రాతోపాటు అనురాగ్ పాల్ అలియాస్ లంకేష్, జనార్దన్ కుమార్ చౌరాసియా అలియాస్ సంతోష్ లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నెట్‌వర్క్‌లోని ఇతర సభ్యులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.


