అయోధ్యలో లక్ష దీపోత్సవం  | Ayodhya Ram temple complex to be illuminated with 1 lakh diyas | Sakshi
Sakshi News home page

అయోధ్యలో లక్ష దీపోత్సవం 

Nov 2 2026 6:01 AM | Updated on Nov 2 2026 6:01 AM

Ayodhya Ram temple complex to be illuminated with 1 lakh diyas

అయోధ్య: పవిత్ర నగరమైన అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రాంగణం లక్ష దీపాలతో వెలిగిపోనుంది. శనివారం సమావేశం నిర్వహించిన ఆలయ ట్రస్టు.. ప్రాంగణాన్ని ఐదు జోన్లుగా విభజించి దీపోత్సవ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. ప్రతి జోన్‌కు బాధ్యులను, బృందాలను నియమించి, వారి బాధ్యతలను కూడా స్పష్టంగా నిర్దేశించింది. 

ఆలయ ప్రాంగణమంతటా దీపాలను వెలిగించేందుకు సుమారు వెయ్యి మంది స్వచ్ఛంద సేవకులు సహకరించనున్నారని, రాబోయే 5 రోజుల్లో క్షేత్రస్థాయిలో అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతాయని పేర్కొంది. ఆలయ ప్రాంగణం, గ్రీన్‌ హౌస్, యజ్ఞశాల ప్రాంతాల్లో మొత్తం 30,000 దీపాలు, కుబేర్‌ తిల, సప్తమండపం, శేషావతార ఆలయం, హుతాత్మ స్మారకం, పంచవటి జోన్లలో 30,000కు పైగా దీపాలు వెలిగిస్తారు.

 రిటర్న్‌ దర్శన్‌ మార్గం, యాత్రికుల సౌకర్య కేంద్రం, పిఎఫ్సి ప్లాజా, నల్‌ తిల జోన్లలో 14,000 దీపాలు, యాత్రికుల సేవా కేంద్రం, అంగద తిల, సీతా రసోయి మరియు రామానందాచార్య గేట్‌ ప్రాంతాల్లో 13,000కు పైగా దీపాలు, శ్రీరామ జన్మభూమి పథ్, దర్శన మార్గం, సింహద్వారం, చరణ పాదుక జోన్లలో 13,000 దీపాలను వెలిగించనున్నారు.

 ఈ కార్యక్రమానికి రాష్ట్ర పోలీసులతో పాటు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) కూడా సహకారం అందించనున్నాయి. దీపోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు నిరీ్ణత సమయానికి పూర్తవుతాయని ట్రస్టు మీడియా మేనేజర్‌ సుభాష్‌ చంద్ర సింగ్‌ తెలిపారు. అయోధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని కొత్త శిఖరాలకు చేర్చే సాధనంగా ‘దీపోత్సవం’మారనుందని, అయోధ్యను ప్రపంచ వేదికపై నిలబెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇది మరింత బలం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement