అది సూపర్‌ ఫ్లాప్‌ ర్యాలీ..!  | BJP Mp Sambit Patra Mocks Rahul Gandhi Over INDIA Bloc Rally | Sakshi
Sakshi News home page

అది సూపర్‌ ఫ్లాప్‌ ర్యాలీ..! 

Nov 2 2026 6:19 AM | Updated on Nov 2 2026 6:19 AM

BJP Mp Sambit Patra Mocks Rahul Gandhi Over INDIA Bloc Rally

10 లక్షలు కాదు.. వచ్చింది 7 వేల మందే 

బీజేపీ నేత సంబిత్‌ పాత్ర వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ఇండియా కూటమి పక్షాల ర్యాలీ లక్ష్యంగా బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ బహిరంగ సభకు అనూహ్య స్పందన లభించిందనీ, కనీసం 10 లక్షల మంది వచ్చినట్లు కాంగ్రెస్‌ గొప్పలు చెప్పుకుంటోందని ఆరోపించింది. కేవలం 5 వేల నుంచి 7 వేల మంది మాత్రమే హాజరయ్యారని స్పష్టం చేసింది. బీజేపీ ఎంపీ సంబిత్‌ పాత్ర ఆదివారం మీడియాతో మాట్లాడారు. 

ఆదివారం ఉదయం నుంచీ ఈ ర్యాలీని పరిశీలిస్తున్నాననీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రసంగం విన్నానని అన్నారు. ఈ ర్యాలీ వట్టి సమయం వృథా ప్రయాసమాత్రమేని తేలిపోయిందని ఆయన తెలిపారు. సభా ప్రాంగణంలో ఎక్కువ భాగం ఖాళీగా కనిపిస్తున్న దృశ్యాలను చూపిన సంబిత్‌ పాత్ర..ఎక్కడ 10 లక్షల మంది? అని ప్రశ్నించారు. పెద్ద సంఖ్యలో జనం వచ్చినట్లుగా ఫొటోగ్రఫీతో కనికట్టు చేసినట్లుగా కాంగ్రెస్‌ నేతలు పవన్‌ ఖేరా, కేసీ వేణుగోపాల్‌ చేసిన ప్రకటనలతో అర్థమైపోతోందన్నారు. 

‘సుమారు 12 ఎకరాల్లో విస్తరించి ఉన్న రామ్‌లీలా మైదానంలో స్టేజీ, హాజరైన వారు కూర్చునేందుకు చేసిన ఏర్పాట్లు గ్రౌండ్‌లో కేవలం 15 శాతం మాత్రమే ఆక్రమించాయి. ఇంకా కనీసం 40 శాతం మైదానం ఖాళీగానే ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన 28 వేల కుర్చిలకుగాను కేవలం 5 వేల నుంచి 7 వేల వరకే జనంతో ఉన్నాయి. ఈ విజువల్స్‌ బట్టి చూస్తే 10 లక్షల మంది వచ్చారంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ప్రకటనలపై అనుమానాలు కలుగుతున్నాయి’అని ఆయన వివరించారు. ఇన్ని పార్టీలు, జెండాలను ఒకే చోటుకు తీసుకు వచ్చినప్పటికీ 10 లక్షల మందిని సమీకరించలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. 

ప్రధాని మోదీని వెళ్లనివ్వం 
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాల నుద్దేశించి రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు మొఘల్‌ చక్రవర్తి కుమారుడు చేసినట్లుగానే ఉన్నాయంటూ సంబిత్‌ పాత్ర మండిపడ్డారు. ‘ఈ హిందుస్తాన్‌ మీ అయ్యది కాదు. ఇది హిందుస్తానీలది. ప్రధాని మోదీ, అమిత్‌ షా ఎక్కడికీ వెళ్లరు. రాహుల్‌ గాంధీ అనవసర అంశాలను లేవనెత్తినంత కాలం ప్రధాని మోదీ వెళ్లరు. ఒకవేళవారు వెళ్లాలనుకున్నా మేం వెళ్లనివ్వం’అని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలు అక్రమమని రాహుల్‌ గాంధీ పేర్కొనడంపై సంబిత్‌ పాత్ర స్పందిస్తూ.. ఆ లెక్కన చూస్తే ప్రతిపక్ష నేత రాహుల్, ఆయన పార్టీ ఎంపీలందరి ఎన్నికా అక్రమమేన్నారు. రాహుల్‌ను అక్రమ ప్రతిపక్ష నేతగా ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, రాహుల్‌ ఆరోపిస్తున్నట్లుగా 2024 ఎన్నికలప్పుడు సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్‌ లేనే లేరన్నారు. ఆయన 2025లో సీఈసీగా బాధ్యతలు చేపట్టారని సంబిత్‌ పాత్ర గుర్తు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement