Photo Credit: Twitter
ఒమన్ వేదికగా నవంబర్ 5 నుంచి 14 మధ్య అండర్-19 ఆసియా కప్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత యువ జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్‌లు ఈ టోర్నీలో ఆడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
టోర్నీకి ఇంకా జట్టును ప్రకటించనప్పటికీ ఈ ఇద్దరు ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవలే సొంతగడ్డపై ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో అన్వయ్, ఆర్యవీర్‌లు అదరగొట్టారు. ఈ ఇద్దరు రాణించడంతో భారత యువ జట్టు 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఇక ఆసియా కప్‌లో గ్రూప్ దశలో భారత యువ జట్టు పాకిస్తాన్, నేపాల్, యూఏఈతో మ్యాచ్‌లు ఆడనుంది.
ఒకవేళ ఆర్యవీర్, అన్వయ్‌లు ఎంపికైతే మాత్రం గతంలో వీరిద్దరి తండ్రులు కలిసి పాకిస్తాన్‌ను చీల్చి చెండాడినట్లే.. ఇప్పుడు వారి కుమారులు కూడా అదే పాక్‌పై తమ ప్రతాపం చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నవంబర్ 8న జరగనుంది.
గత ఆసియా కప్‌లో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మహాత్రేపై ఉన్నట్లే ఈసారి ఆసియా కప్‌లో ఆర్యవీర్, అన్వయ్‌లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారనున్నారు. అయితే 2025 అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ 191 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తు చేసి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. అయితే 2026 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై గెలిచిన భారత్ ప్రతీకారం తీర్చుకుంది.
ఇదీ చదవండి: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి.. సిరీస్ సొంతం చేసుకున్న ఆసీస్


