ఓహియోలో ఆమె రికార్డ్‌ : ఆ తప్పులే వివేక్‌ కొంపముంచాయా? | Democrat Amy Acton Defeats Vivek Ramaswamy in Ohio Governor Race | Sakshi
Sakshi News home page

ఓహియోలో ఆమె రికార్డ్‌ : ఆ తప్పులే వివేక్‌ కొంపముంచాయా?

Nov 4 2026 8:15 PM | Updated on Nov 4 2026 8:21 PM

Democrat Amy Acton Defeats Vivek Ramaswamy in Ohio Governor Race

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమో క్రాట్లు  ప్రభంజనాన్ని సృష్టాంచారు. భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త, రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి అమెరికాలోని ఓహియో (Ohio)  గవర్నర్ ఎన్నికల్లో  ఘోర పరాజయాన్ని చవిచూశారు.  రిపబ్లికన్ అభ్యర్థి న్యూయార్క్‌లో సరిత కోమటిరెడ్డి వంటి  ఘోరంగా ఓడిపోయారు. రిపబ్లికన్లకు మొగ్గుచూపే రాష్ట్రంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో, ఒహియోకు తొలి భారతీయ-అమెరికన్ గవర్నర్ అయ్యే ప్రయత్నంలో 41 ఏళ్ల రామస్వామికి కీలకమైన ప్రయోజనాలు ఉన్నాయని విస్తృతంగా భావించారు. అయితే, అధ్యక్షుడు ట్రంప్ ఆర్థిక వ్యవస్థను తీరు, ఇరాన్‌తో యుద్ధంపై ప్రజల ఆగ్రహం దీన్ని దెబ్బతీసింది.  

వివాదాలు, స్వయంకృతాపరాధం
ఆయనపై డెమోక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టన్ ఘన విజయం సాధించారు. తద్వారా ఓహియో చరిత్రలోనే తొలిసారి ఎన్నికైన మహిళా గవర్నర్‌గా అమీ రికార్డు సృష్టించారు ఈ ఎన్నికల్లో అమీ ఆక్టన్ 51 శాతానికి పైగా ఓట్లను సాధించగా, రామస్వామి 45 శాతానికి పైగా ఓట్లను పొందారు. అయితే వివేక్‌ వివాదాస్పద ప్రచార ప్రకటన  ఆయన ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 

వ్యాపారవేత్త నుండి రాజకీయ నాయకుడిగా ఎదిగి, వివాదాస్పద అధ్యక్షుడ  ట్రంప్‌ అనుచరుడిగా రామస్వామి, వివాదాలు తప్పులతో పరిస్థితిని మరింత దిగజార్చుకున్నారనేది పలువురి విశ్లేషణ. తన ప్రత్యర్థి అమీ యాక్టన్ (Amy Acton) కుటుంబ సభ్యులను ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేక్ రామస్వామి విడుదల చేసిన ఒక ప్రకటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఆమెపై చేసిన వ్యక్తిగత దాడి, ప్రకటనలోని అంశాలు రిపబ్లికన్ పార్టీలోని కొందరు కీలక నేతలు కూడా ఖండించారు. ఇక సాధారణ ఓటర్లలోనూ ఇవి తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. అంతేకాదు వివేక్ రామస్వామి ప్రచార ప్రకటనలో ఒక లైంగిక నేరస్థుడిని చేర్చడం మరో పెద్ద వివాదంగా మారింది. ఇది ఓటర్లలో ఆయనపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందంటున్నారు విశ్లేషకులు.

ఇదీ చదవండి: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల సత్తా

అమీ యాక్టన్‌కు అనూహ్య మద్దతు 
మరోవైపు  పోలింగ్‌కు ముందు నుంచే సర్వేలలో అమీ యాక్టన్ స్వల్ప ఆధిక్యతతో కొనసాగారు. వివేక్ రామస్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు , ప్రకటనల వల్ల తటస్థ ఓటర్లు, మహిళా ఓటర్లు అమీ యాక్టన్ వైపు మొగ్గు చూపడానికి కారణమయ్యాయి. 2024 రిపబ్లికన్ అధ్యక్ష నామినేషన్ రేసు నుండి తప్పుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇచ్చి, ఆయన ప్రభుత్వంలో కొన్నాళ్లు పనిచేసిన వివేక్ రామస్వామి, ఓహియోలో సొంతంగా బలమైన ఓటు బ్యాంకును నిర్మించుకోవడంలో, స్థానిక ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫల కావడంతోపాటు, ప్రచారంలో జరిగిన తప్పిదాల వల్లే ఓహియో గవర్నర్ ఎన్నికల్లో వివేక్ రామస్వామికి ఓటమి ఎదురైందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: US midterm elections 2026 ఓడిపోయిన ఇండియన్‌ అమెరికన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement