అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమొక్రాట్లు సంచలనం సృష్టించారు. రిపబ్లికన్ల అదీనంలో ఉన్న సెనేట్ పగ్గాలను తిరిగి తమ సొంతం చేసుకోగలిగారు. మెజారిటీకి నికరంగా 4 స్థానాల్లో గెలుపు అవసరం కాగా.. ఏడు రిపబ్లికన్ స్థానాల్లో గెలిచారు. దీంతో సెనేట్‌లో డెమొక్రాట్ల బలం 54కు పెరిగింది. గెలుపు గుర్రాలు ఇవే...
1. టెక్సాస్: జేమ్స్ తలారికో రిపబ్లికన్ అభ్యర్థి కేన్ పాక్స్టన్‌పై విజయం సాధించారు. దీంతో టెక్సాస్‌లో 38 ఏళ్ల రిపబ్లికన్ల ఆధిపత్యానికి తెరపడింది.
2. నార్త్ కరోలినా: రాయ్ కూపర్ రిపబ్లికన్ ప్రత్యర్థి మైఖేల్ వాట్లీని ఓడించారు.
3. సౌత్ కరోలినా: అన్నీ ఆండ్రూస్ రిపబ్లికన్ అబ్యర్థి డార్లీన్ గ్రాహంపై ఘనవిజయం సాధించారు. ట్రంప్ మద్దతుదారైన ’లూసియన్/లిండ్సే గ్రాహం సోదరి ఈ డార్లీన్.
4. ఒహాయో: షెర్రోడ్ బ్రౌన్ రిపబ్లికన్ అభ్యర్థి జాన్ హస్టెడ్‌పై గెలుపొందారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఖాళీ చేసిన సీటు ఇది.
5. కాన్సాస్: ఆడమ్ హామిల్టన్ రిపబ్లికన్ సెనేటర్ రోజర్ మార్షల్‌ను ఓడించారు. కాన్సాస్‌లో ఒక డెమొక్రాట్ సెనేటర్‌గా గెలవడం 94 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
6. అయోవా: జోష్ తురెక్ రిపబ్లికన్ ప్రత్యర్థి ఆష్లే హిన్సన్‌పై గెలిచారు.
7. మెయిన్: ట్రాయ్ జాక్సన్ సుసాన్ కొల్లిన్స్‌ను ఓడించి సెనేటర్‌గా ఎన్నికయ్యారు. సూసన్ కొల్లిన్స్ 30 ఏళ్లుగా సెనేటర్‌గా ఉన్నారు.
గవర్నర్ రేసులోనూ...
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భాగంగా 35 రాష్ట్రాల గవర్నర్ పదవుల కోసం జరిగిన ఓటింగ్‌లోనూ డెమొక్రాట్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఇప్పటివరకూ రిపబ్లికన్ల చేతుల్లో ఉన్న నాలుగు గవర్నర్ పీఠాలను తమవశం చేసుకున్నారు. దీంతో చాలా ఏళ్ల తరువాత దేశవ్యాప్తంగా మెజార్టీ గవర్నర్ స్థానాల్లో డెమొక్రాట్లు స్థానం సంపాదించుకున్నట్లు అయ్యింది.
1. టెక్సాస్: రాష్ట్ర డెమొక్రాటిక్ అభ్యర్థి గినా హిజోనోసా అనూహ్య విజయంతో ప్రస్తుత గవర్నర్ రిపబ్లికన్ అభ్యర్థి, నాలుగుసార్లు గవర్నర్‌గా పనిచేసిన గ్రెగ్ అబాట్‌ను ఓడించారు.
2. జార్జియా: గవర్నర్‌గా ఎన్నికైన మొట్టమొదటి నల్ల జాతీయురాలిగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన కీషా లాన్స్ బాటమ్స్ ఈ ఎన్నికల్లో రికార్డు సృష్టించారు. రిపబ్లికన్ అభ్యర్థి రిక్ జాక్సన్‌పై గెలుపొందారు. జార్జియాలో రెండు దశాబ్దాలుగా రిపబ్లికన్లదే రాజ్యం కావడం గమనార్హం.
3. ఒహాయో: భారతీయ సంతతి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామిని డెమోక్రటిక్ పార్టీ ఆమీ ఆక్టన్ ఓడించి గవర్నర్‌గా ఎన్నికయ్యారు. వివేక్ రామస్వామి ట్రంప్ మద్దతుదారు, భారతీయ సంతతి నేత అన్నది తెలిసిందే.
4. అయోవా: డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి గవర్నర్‌గా గెలవడం దాదాపు ఇరవై ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన రాబ్ సాండ్ రిపబ్లికన్ అభ్యర్థి జాక్ లాన్‌ను ఓడించారు.


