ఇరాన్‌ యుద్ధం పెను ప్రభావం చూపింది: ట్రంప్‌  | Iran war a major impact in US midterm election results, says Donald Trump | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ యుద్ధం పెను ప్రభావం చూపింది: ట్రంప్‌ 

Nov 5 2026 5:57 AM | Updated on Nov 5 2026 5:57 AM

Iran war a major impact in US midterm election results, says Donald Trump

వాషింగ్టన్‌:  మధ్యంతర ఎన్నికలపై ఇరాన్‌ యుద్ధం పెను ప్రభావం చూపిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం అంగీకరించారు. ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఈ సంఘర్షణ ఫలితంగా పెరిగిన ధరల పట్ల ఓటర్లు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. అయితే, ఆ యుద్ధం తాను చేయక తప్పలేదని వ్యాఖ్యానించారు. ఇరాన్‌ విషయంలో యుద్ధం చేయాల్సి వచ్చిందని, దాన్ని తాము కొనసాగిస్తున్నామని విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. ఓటమికి ఇరాన్‌తో యుద్ధమే కారణమని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కూడా అభిప్రాయపడ్డారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement