‘ఒక మనిషి ఆయుష్షు ఎంత కాలం?’ | Buddha Life Lessons Value Of Time | Sakshi
Sakshi News home page

‘ఒక మనిషి ఆయుష్షు ఎంత కాలం?’

Nov 6 2026 8:11 AM | Updated on Nov 6 2026 8:44 AM

Buddha Life Lessons Value Of Time

జ్యోతిర్మయం

గతించిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే. ఆ క్షణాన్ని మన జీవితా నికి ఉపయోగపడేలా సద్వినియోగం చేసుకోవాలి.

ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యుల్ని ‘ఒక మనిషి ఆయుష్షు ఎంత కాలం?’ అని అడిగాడు. సమాధానం అందరికీ తెలుసనుకున్న ఒక శిష్యుడు వెంటనే లేచి, ‘వందేళ్లు’ అని చెప్పాడు. బుద్ధుడు చిరునవ్వుతో ‘తప్పు’ అన్నాడు. ఒక్కొక్కరు ఎనభై ఏళ్లు, అరవై ఏళ్లు, యాభై ఏళ్లు... ఇలా అనేక సమాధానాలు చెప్పారు. అవన్నీ తప్పేనని చెప్పడంతో శిష్యులంతా అయోమయంలో పడిపోయారు. అప్పుడు తథాగతుడు ‘ఒక మనిషి ఆయుష్షు ఒక్క శ్వాస తీసుకునేంత సమయం మాత్రమే!’ అన్నాడు. శిష్యులంతా విస్తుపోయారు. అంటే ‘క్షణం మాత్రమే కదా!’ అన్నారు వారు.

అప్పుడు బుద్ధుడు ‘నిజమే! శ్వాస తీసుకునే సమయం క్షణం మాత్రమే. కానీ మనిషి జీవితం ఆ శ్వాసలోనే ఉంది. అందుకే ప్రతి క్షణాన్నీ సంపూర్ణంగా జీవించాలి. గతం గురించి బాధపడుతూ, భవిష్యత్తు గురించి భయపడుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకోవడం ఎందుకు? మన చేతిలో ఉన్నది వర్తమానం మాత్రమే. దానిపైనే మనకు అధికారం ఉంది. కాబట్టి ప్రతి క్షణాన్నీ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ, మన జీవితానికి అర్థం వచ్చేలా జీవించాలి’ అని వివరించాడు.
– యామిజాల జగదీశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement