లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో పెళ్లి వేడుకల సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. వివాహ ఊరేగింపుకు ముందు జరిపిన సంబరాల కాల్పుల్లో ఐదేళ్ల బాలుడు మృతి చెందిన కలకలం రేపింది. ఈ విషాదకర ఘటన ఆదివారం రాత్రి ఫుటెహరి బాంకే గ్రామంలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం, కడిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుతెహరి గ్రామానికి చెందిన ఘనశ్యామ్ పటేల్ ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. పెళ్లి ఊరేగింపు బయలుదేరడానికి కొద్దిసేపటి ముందు, బాలుడి బంధువు అయిన అజయ్ అనే వ్యక్తి తన లైసెన్స్ కలిగిన తుపాకీతో అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో ఆ బుల్లెట్ అక్కడ నిలబడి ఉన్న అర్ష్ పటేల్ పటేల్ (5) పొత్తికడుపులోకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన బాలుడిని తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కలిసి వెంటనే కాదిపూర్ ఆరోగ్య కేంద్రానికి, అనంతరం సుల్తాన్‌పూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: 20 అడుగుల ముత్యాల హనుమాన్ : దీపావళి వేళ అద్భుతం
బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపారు. దర్యాప్తు జరుగుతోందని, సర్కిల్ ఆఫీసర్ వినయ్ గౌతమ్ తెలిపారు. కాగా గతేడాది 2025 ఫిబ్రవరిలోనూ నోయిడాలో పెళ్లి ఊరేగింపు కాల్పుల వల్లే బాల్కనీలో నిలబడి వేడుక చూస్తున్న రెండేళ్ల బాలుడు మరణించిన సంగతి విదితమే.
ఇదీ చదవండి: ఫస్ట్ ఏసీలోనే నగలు,నగదు చోరీ మహిళ ఆగ్రహం : స్పందించిన రైల్వే


