breaking news
Hanger
-
కొత్త రకం హ్యాంగర్.. దగ్గరకు వెళ్తే పరిమళాలు వెదజల్లుతుంది!
దుస్తులు వేలాడదీసుకోవడానికి కలప హ్యాంగర్లు, లోహపు హ్యాంగర్లు చాలాకాలంగా వాడుకలో ఉన్నవే! వార్డ్‌రోబ్‌లలో దుస్తులు దాచుకోవడానికి చాలామంది హ్యాంగర్లు వాడుతుంటారు. సాదాసీదా హ్యాంగర్లకు అంతకు మించిన ఉపయోగం ఇంకేమీ లేదు. అయితే, అమెరికాకు చెందిన చైనీస్ సంతతి డిజైనర్ సూవా షోయి ఇటీవల ‘ప్లౌడ్’ పేరుతో పరిమళాలను వెదజల్లే హ్యాంగర్‌కు రూపకల్పన చేసింది. ఈ హ్యాంగర్‌ను విడిభాగాలుగా విడదీసుకోవడం, తిరిగి జోడించడం చాలా తేలిక. ఈ హ్యాంగర్‌లో గొట్టంలా ఉండే భాగంలో నచ్చిన పరిమళాలతో కూడిన సెంట్ పాడ్స్‌ను నింపుకొని, తిరిగి బిగించేసి, దుస్తులు తగిలించుకుంటే చాలు. ఈ హ్యాంగర్ అన్నివైపులా సమానంగా తిరుగుతూ దుస్తులను పరిమళభరితం చేస్తుంది. ఈ పరిమళాల హ్యాంగర్ ఇంకా మార్కెట్లోకి విడుదల కావాల్సి ఉంది. -
హ్యాంగర్.. సూపర్..
ఇదో వినూత్న హ్యాంగర్. దీని పేరు ప్యూర్ టవల్. మనం స్నానం చేసి.. తుడుచుకున్న తర్వాత టవల్‌ను ఈ హ్యాంగర్‌కు తగిలిస్తే చాలు.. సెకన్లలో శుభ్రపరిచేస్తుంది. ఇందులో ఉండే అల్ట్రా వయలెట్ కిరణాలు బ్యాక్టీరియాను చంపేసి.. టవల్‌ను శుభ్రపరుస్తాయి. అంతేకాదు.. ఇందులో ఉండే హైస్పీడ్ డ్రయర్ వెంటనే దీన్ని అరబెట్టేస్తుంది. ఇందుకు పట్టే సమయం 10 సెకన్లే! ఈ డిజైన్‌ను మెక్సికోకు చెందిన లియోబార్డో అర్మెంటా రూపొందించారు. ఎలక్ట్రోలక్స్ డిజైన్ ల్యాబ్ అవార్డు-2014కు పోటీ పడుతున్న డిజైన్లలో ప్యూర్ టవల్ కూడా ఒకటి.