5.2 బిలియన్‌ డాలర్లకు.. పరిమళాలు, ఫ్లేవర్ల పరిశ్రమ

Fragrance, Flavour Industry To Exceed 5 Bn Dollars In 3 To 4 Years - Sakshi

కోల్‌కతా: దేశీయంగా పరిమళాలు, ఫ్లేవర్ల పరిశ్రమ ఏటా 12 శాతం వృద్ధి చెందనుంది. దీంతో వచ్చే మూడు, నాలుగేళ్లలో 5.2 బిలియన్‌ డాలర్లకు చేరగలదని అంచనాలు నెలకొన్నాయి. ఫ్రాగ్రెన్సెస్‌ అండ్‌ ఫ్లేవర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఏఎఫ్‌ఏఐ) ప్రెసిడెంట్‌ రిషభ్‌ కొఠారీ ఈ విషయాలు తెలిపారు. ‘దేశీయంగా ఫ్రాగ్రెన్స్, ఫ్లేవర్స్‌ పరిశ్రమ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది.

ప్రస్తుతం ఇది 3.7 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది‘ అని ఆయన చెప్పారు. వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు, ఇతరత్రా అంశాలపై ఖర్చు చేయగలిగే స్థాయిలో ఆదాయాలు పెరుగుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని కొఠారీ వివరించారు.

ఆహారోత్పత్తులు, పానీయాలు, వ్యక్తిగత సౌందర్య సంరక్షణ, హోమ్‌కేర్, ఫార్మా, కాస్మెటిక్స్‌ మొదలైన రంగాల్లో వీటిని ఎక్కువగా వినియోగి స్తుంటారు. సహజసిద్ధమైన, సేంద్రియ ఉత్పత్తులవైపు వినియోగదారులు మళ్లుతున్నందున ఆ విభాగాల్లో ఫ్రాగ్రెన్స్, ఫ్లేవర్స్‌ సంస్థలకు వ్యాపార అవకాశాలు ఉన్నాయని కొఠారీ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top