దసరా ఉత్సవాల్లో దుర్గగుడి అంతరాలయ దర్శన టికెట్ ధర రూ.1,000కి పెంపు
ప్రస్తుతం అంతరాలయ దర్శన టికెట్ ధర రూ.500
టికెట్ ధరల పెంపునకు చంద్రబాబు సర్కార్ గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం పండుగల పేరుతో ఆలయాల్లో వ్యాపారం మొదలు పెట్టింది. పండుగ రోజుల్లో దైవ దర్శన టికెట్ల ధరలు పెంచేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాల వేళ అమ్మవారి అంతరాలయ దర్శనం టికెట్ ధరను రూ.500 నుంచి రూ.1,000కి పెంచాలని నిర్ణయించింది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా రెండేసి గంటలపాటు రూ.1,000 టికెట్లు ఉన్నవారికి అంతరాలయ దర్శనాలకు అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు దేవదాయశాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ మేరకు తాజాగా దుర్గగుడి పాలకమండలి అంతరాలయ దర్శన టికెట్ ధరను రూ.1,000లకు పెంచుతూ తీర్మానానికి ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. మధ్య తరగతి వర్గాలను అమ్మవారి అంతరాలయ దర్శనానికి దూరం చేసేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని భక్తులు మండిపడుతున్నారు. కలియుగదైవం తిరుమల శ్రీవారి భక్తుల విశ్వాసాలనే తమ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవడానికి పవిత్ర లడ్డూ ప్రసాదంపై జుగుప్సాకరమైన విమర్శలు చేసిన చంద్రబాబు, కూటమి పారీ్టల నేతలు ఇప్పుడు గుళ్లలోనూ పండుగ వ్యాపారం మొదలుపెట్టారంటూ భక్తులు మండిపడుతున్నారు.


