రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్‌ మృతి | Young Doctor Gunna Sruthi Katyayani Ends Life | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్‌ మృతి

Oct 4 2026 10:47 AM | Updated on Oct 4 2026 11:23 AM

Young Doctor Gunna Sruthi Katyayani Ends Life

పార్వతీపురం మన్యం: మండలంలోని కోనాడ జంక్షన్‌ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. రాజమండ్రి నుంచి కారు మీదు వస్తుండగా పూసపాటిరేగ మండలం కోనాడ జంక్షన్‌ వద్ద జరిగిన ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరువంక గ్రామానికి చెందిన గున్న సృతి కాత్యాయని(26)  విజయనగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. 

మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. హామియో వైద్య కోర్సు పూర్తి చేసుకున్న సృతి కాత్యాయని అనుకోని ప్రమాదంలో రెప్పపాటు సమయంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.  పూసపాటిరేగ ఎస్‌ఐ వి.అరుణ్‌కిరణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement