● డీఎంహెచ్ఓ విజయలక్ష్మి
పార్వతీపురం రూరల్: మెరుగైన వైద్యసేవల దిశగా ఆరోగ్య కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని, మాతా శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పి.విజయలక్ష్మి స్పష్టం చేశారు. జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఆశ, నోడల్ అధికారుల సమావేశంలో ప్రొగ్రాం అధికారులతో కలిసి వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఆర్సీహెచ్లో గర్భిణి, శిశు నమోదు, ఆశయాప్లో మాతాశిశు సేవల నివేదికలు త్వరగా నమోదు చేయాలని ఆదేశించారు. ఎనీమియా, ముక్త్ భారత్, పీఎంఎస్ంఏ, సికిల్‌సెల్ ఎనీమియా పరీక్షలు, ఆరోగ్య పర్యవేక్షణ నివేదికలు ఎప్పటికప్పుడు అందజేయాలని, పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచాలని, హెచ్‌పీవీ, ఎంఆర్ టీకాలు శతశాతం సాధించాలని చెప్పారు. సమావేశంలో డీఐఓ వై.విజయ్‌మోహన్, డీఎల్‌ఏటీఓ షేక్ హఫీజా, ఆర్బీఎస్కే పీఓ టి. జగన్మోహన్రావు, డాక్టర్ గుణశ్రీ, డీపీఓ లీలారాణి, డీపీహెచ్ ఎన్ఓ విజయలక్ష్మి, డీసీఎం విజయలత, తదితరులు పాల్గొన్నారు.


