46 ఒడిశా మద్యం సీసాల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

46 ఒడిశా మద్యం సీసాల పట్టివేత

Nov 18 2026 1:02 AM | Updated on Nov 18 2026 1:02 AM

● ఒకరి అరెస్ట్‌

పార్వతీపురం రూరల్‌: ఎకై ్సజ్‌ శాఖ పార్వతీపురం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కూనేరు ఎకై ్సజ్‌ చెక్‌పోస్ట్‌ వద్ద నిర్వహించిన తనిఖీలలో 46 ఒడిశా బ్రాందీ సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం కూనేరు చెక్‌పోస్ట్‌ వద్ద సాధారణ తనిఖీలు చేపడుతుండగా, ఒడిశా నుంచి ద్విచక్ర వాహనంపై అక్రమంగా మద్యం తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 46 బ్రాందీ సీసాలతో పాటు రవాణాకు వినియోగించిన బైక్‌ను సీజ్‌ చేసి, నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

అంతర్రాష్ట్ర సరిహద్దుల నుంచి అక్రమ మద్యం, ఇతర నిషేధిత వస్తువుల రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్ట్‌ వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు స్థానిక ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలను ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement