●న్యాయవాదుల సంఘం ఏకగ్రీవ తీర్మానం
● నిరసనగా రెండు రోజులు విధులు బహిష్కరణ
విజయనగరం లీగల్: రాత్రిపూట కోర్టులు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విజయనగరం న్యాయవాదుల సంఘం వ్యతిరేకించింది. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నళితం రమేష్‌కుమార్ మాట్లాడుతూ రాత్రి పూట కోర్టులు నిర్వహించడం సమంజసం కాదని, దీనివల్ల న్యాయవాదులు ఒత్తిడికి లోనవుతారని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనికి నిరసనగా గురు, శుక్రవారాలలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది నియామకంపై దృష్టిసారించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు గడి మురళీకృష్ణ, పి.బ్రహ్మాజీ, రామచంద్రరావు, మూర్తి, తదితర సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.


