న్యూస్‌రీల్
సస్పెన్షన్ రెండు నెలల ముచ్చటేనా?
ఆదేశాలకే దిక్కులేదా?
అభం శుభం తెలియని అమాయక గిరిజనులను ఆదుకునేదెవరు? వారి మాట వినువారెవ్వరు? వారి గోడు పట్టించుకునే నాథులెవరు? గిరిజనుల సంక్షేమం అభివృద్ధిని పట్టించుకునేందుకు ఏర్పాటు చేసి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పాలన సక్రమంగా లేక గిరిజనులకు సంక్షేమం, అభివృద్ధి క్రమంగా దూరమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీడీఏలో కీలకమైన పోస్టుల్లో రెగ్యులర్ అధికారులు లేక డిప్యుటేషన్, ఇన్చార్జ్ బాధ్యతల్లో ఉన్నవారు పట్టించుకోక గిరిజనుల ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఐటీడీఏ పాలనను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని పలు గిరిజన సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
బుధవారం శ్రీ 18 శ్రీ నవంబర్ శ్రీ 2026
ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల వసతి గృహాల్లో కుక్‌లు, కమాటీలుగా పలువురిని విధుల్లోకి తీసుకున్నారు. సుమారు మూడు నెలల పాటు వారు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పనిచేశారు. ఇప్పటివరకు వారికి వేతనాలు అందలేదు. ఈ విషయంపై ఐటీడీఏ అధికారులను ప్రశ్నిస్తే, అసలు వారిని విధుల్లోకి తీసుకున్నట్లు తమ వద్ద పేర్లే లేవని చెబుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. నెలల తరబడి పనిచేయించుకుని, ఇప్పుడు తమకు సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. విధుల్లోకి తీసుకున్న వారి వివరాల నమోదు, వేతనాల చెల్లింపుల విషయంలోనూ సమన్వయం కొరవడిందనే ఆరోపణలకు ఈ ఘటన బలం చేకూరుస్తోంది.
సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజనుల అభివృద్ధికి దిక్సూచిగా నిలవాల్సిన పార్వతీపురం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లో పాలన క్రమంగా గాడి తప్పుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజన విద్యార్థుల విద్య, వసతి, భోజనం, భద్రత మొదలుకుని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి వరకు కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన సంస్థలోనే పర్యవేక్షణ కొరవడడం ఆందోళన కలిగిస్తోంది. కీలక అధికారుల పోస్టులు అదనపు బాధ్యతలు, ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తుండడంతో క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పట్టు సడలుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న పీవో వైశాలి సైతం పాలనలో ప్రభావం చూపలేకపోతున్నారన్న విమర్శలు గిరిజన సంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా కొందరు సిబ్బంది నిబంధనలను సైతం ఖాతరు చేయకుండా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారులున్నా.. పర్యవేక్షణ ఏదీ?
ఐటీడీఏకు రెగ్యులర్ ప్రాజెక్టు అధికారి (పీవో) ఉన్నప్పటికీ, ఆమెకు జాయింట్ కలెక్టర్ బాధ్యతలు కూడా ఉండడంతో సంస్థ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. ఇక అత్యంత కీలకమైన డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) పోస్టు కూడా చాలాకాలంగా రెగ్యులర్ అధికారి లేకుండా డిప్యూటేషన్, ఇన్‌చార్జిలతోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీవో మురళికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఇతరవిధులు నిర్వహిస్తున్న ఆయనకు ఐటీడీఏలోని కీలక వ్యవహారాల పర్యవేక్షణ అదనపు భారంగా మారుతోంది. పూర్తిస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడం సంస్థ పరిపాలనపై ప్రభావం చూపుతోందన్న అభిప్రాయాలున్నాయి.
ఉత్తర్వులే సృష్టించేస్తారా?
ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో సిబ్బంది వ్యవహారశైలి ఎలా ఉందో చెప్పడానికి పాచిపెంట మండలం వేటగానివలస ఆశ్రమ పాఠశాల ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. శిక్షణకు వెళ్లాల్సిన ఒక ఎస్జీటీ ఉపాధ్యాయుడు ఐటీడీఏ కార్యాలయం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల హెచ్ఎంతో కలిసి వారే సంతకాలు, అనుమతులతో కూడిన ఉత్తర్వులు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం ఆలస్యంగా పీవో దృష్టికి చేరడంతో సంబంధిత ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
కలెక్టరేట్ వచ్చినా..మారని పరిస్థితి
పార్వతీపురం మన్యం జిల్లాలో అధిక భాగం ఏజెన్సీ ప్రాంతాలే. ఇక్కడి గిరిజనుల విద్య, వైద్యం, సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదలలో ఐటీడీఏ పాత్ర అత్యంత కీలకం. అలాంటి సంస్థలోనే అధికారుల కొరత, పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం వంటి సమస్యలు పేరుకుపోవడం విచారకరం. జిల్లా కేంద్రానికి కలెక్టరేట్ వచ్చిన తర్వాత ఐటీడీఏ ప్రాధాన్యం మరింత తగ్గిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఫలితంగా క్షేత్రస్థాయి వ్యవహారాలపై పట్టుకోల్పోయి, సిబ్బంది ఇష్టారాజ్యానికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. అసలు ఐటీడీఏలో పర్యవేక్షణ వ్యవస్థ పనిచేస్తోందా? గిరిజన విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమం, భద్రతకు భరోసా కల్పించాల్సిన సంస్థలోనే ఇలాంటి పరిస్థితులు కొనసాగితే వారి ప్రయోజనాలను కాపాడేది ఎవరు? ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కీలక పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయడంతోపాటు, సంస్థలో పేరుకుపోయిన పరిపాలనా లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని గిరిజన సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
పార్వతీపురం ఐటీడీఏ
గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సక్రమంగా భోజనం అందడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో వార్డెన్ కృష్ణమోహన్‌ను సస్పెండ్ చేశారు. రెండు నెలలు కూడా గడవకముందే ఆయనకు తిరిగి పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. తొలుత పార్వతీపురంలోని గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో నియమించి, ఆ తర్వాత మళ్లీ కొత్తగూడ ఆశ్రమ పాఠశాలకే డిప్యుటేషన్న్పై పంపడం గమనార్హం. విద్యార్థుల భోజనంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు తీసుకున్న అధికారులు, తిరిగి అదే పాఠశాలకు ఆయనను పంపడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తప్పిదాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారుల చిత్తశుద్ధి ఎంతన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పార్వతీపురం మండలంలోని డోకిశీల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి రాత్రి వేళ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో విధుల్లో ఉండాల్సిన గణిత ఉపాధ్యాయుడు గైర్హాజరు కావడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈలోగా ఓ ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిడి రావడంతో ఆ ఆదేశాలు అమలుకు నోచుకోలేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ పాఠశాల పనితీరు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నా, సిబ్బంది వ్యవహారశైలిలో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదన్న విమర్శలున్నాయి.
పార్వతీపురం ఐటీడీఏలో అస్తవ్యస్త పాలన
కీలక పోస్టులన్నీ అదనపు బాధ్యతలు, ఇన్‌చార్జిలతోనే కొనసాగింపు
పర్యవేక్షణ కొరవడి.. ఇష్టారాజ్యంగా మారుతున్న సిబ్బంది తీరు


