సాక్షి, విశాఖపట్నం: విశాఖలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో యువకుల వీరంగం సృష్టించారు. బీచ్ రోడ్డులోని క్యూబా పబ్ వద్ద యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. నడి రోడ్డుపై వీరంగం సృష్టించినా పోలీసులు పట్టించుకోలేదు.
కాగా, ఇటీవల వైఎంసీఏ సమీపంలో కొందరు యువకులు గంజాయి మత్తులో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని స్థానికులు.. ఆ యువకులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో ముగ్గురు యువకులు అక్కడ నుంచి పరారైనట్లు సమాచారం. బీచ్ రోడ్డులో ఇలాంటి ఘటనలు తరుచుగా పునరావృతం కావడంతో పోలీసులు నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: సౌజన్యతో పెళ్లి.. రూ.25 కోట్ల ఆస్తి కోసం సాధిక్ పథకం


