సాక్షి,కాకినాడ: పొట్టకూటి కోసం బంగాళాఖాతంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతవడంతో కాకినాడ జిల్లా సుబ్బంపేట వాసుల్లో తీవ్ర దోళన నెలకొంది. రోజులు గడుస్తున్నా వారి జాడ తెలియకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 8వ తేదీన కాకినాడ హార్బర్ నుండి గరికిన సింహద్రి బోటుతో పాటు కాకినాడకు చెందిన శివ బోటు బంగాళాఖాతంలో లోతట్టు వేటకు బయలుదేరాయి. బోటు యజమాని గరికిన సింహద్రితో కలిపి మొత్తం ఏడుగురు మత్స్యకారులు సింహద్రి బోటులో వేటకు వెళ్లారు.
అయితే, ఇటీవల సంభవించిన ఆక్వాన్ తుఫాన్ ప్రభావం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో సింహద్రి బోటుతో సంబంధాలు తెగిపోయి ఆచూకీ గల్లంతయ్యింది. చివరిసారిగా ఈ నెల 18న ఒడిశా తీరంలోని పారాదీప్ సమీపంలో ఈ బోటును చూసినట్లు సమాచారం అందింది.
తమ వారి ఆచూకీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సుబ్బంపేట మత్స్యకార కుటుంబాలు, ప్రభుత్వం వెంటనే స్పందించి గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని వేడుకుంటున్నాయి.
ఆచూకీ గల్లంతైన మత్స్యకారుల వివరాలు:
గిరికిన సింహద్రి (బోటు యజమాని)
కందాల రాము
తిర్రి నారాయణ
మెరుగు చిన్న
సూరాడ చిన్న
గంపల ప్రకాష్
సురాడ కోదండ
ఇదీ చదవండి: వేటకు వెళ్లి ఆరుగురి మత్స్యకారుల గల్లంతు!


