సాక్షి,ఏలూరు: టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళా అడ్వకేట్, సామాజిక కార్యకర్త స్వర్ణలతపై టీడీపీ వర్గీయులు దాడికి తెగబడ్డారు. ఆమె జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్తూ, ముఖంపై పిడిగుద్దులు కురిపించారు.
ఏలూరులో టీడీపీ నేతల అక్రమాలు, అవినీతిని ప్రశ్నించినందుకే తనపై ఈ దాడి జరిగిందని స్వర్ణలత ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ప్రశ్నించినందుకు తనను దుర్భాషలాడి దాడికి యత్నించారని ఆమె వాపోయారు.
ఏలూరు షాడో ఎమ్మెల్యే కంప్యూటర్ ప్రసాద్ అక్రమాల చిట్టా బయటపెట్టానన్న కక్షతోనే తనపై దాడి చేయించారని స్వర్ణలత ఆరోపించారు. తనపై జరుగుతున్న భౌతిక దాడులు, వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.


